జబర్ధస్త్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ అనసూయ. చూడ చక్కని అందంతో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది ఈ భామ. పెళ్లి అయి ఇద్దర పిల్లల తల్లి అయిన కూడా ఈ అమ్మడి గ్లామర్ ఇసుమంత తగ్గలేదు. సోషల్ మీడియాలో అనసూయ అందాలకు మంచి డిమాండ్ ఉంది. బుల్లితెర షోస్ తగ్గించిన అనసూయ ఇప్పుడు తన అందాలకు మరింత పదును పెడుతూ క్యూట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అనసూయ జబర్దస్త్ ను వదిలేసి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే సినిమాల్లో ఎక్కువ నటించడానికే నేను జబర్దస్త్ నుండి వెళ్ళిపోతున్నాను అని అనసూయ చెప్పింది. ఇక ప్రస్తుతం అనసూయ పెద్ద పెద్ద సినిమాలలో నటిస్తుంది.
పుష్ప సినిమాలో నటించిన అనసూయ.. చిరంజీవి గాడ్ ఫాధర్ సినిమాలో కూడా మంచి పాత్రలోనే చేసింది. అలాగే లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా అనసూయకు మంచి అవకాశాలు అనేవి వస్తున్నాయి. ఈ అమ్మడు సినిమాలు, టీవీ షోస్‌కి భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అలానే సోషల్ మీడియా ద్వారా బాగానే ఆర్జిస్తుంది. ఈ మధ్య అనసూయ ఆస్తులు అనేవి భారీగా పెరుగుతున్నాయి అని సమాచారం. ప్రస్తుతం అనసూయ ఆస్తులు మొత్తం దాదాపుగా 25 కోట్ల వరకు ఉంటాయి అని తెలుస్తుంది.
ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న అనసూయ.. ఆస్తులు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి అని అంటున్నారు. కాగా, అనసూయ కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది. ముఖ్యంగా ‘క్షణం’, ‘రంగస్థలం’లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి.
పలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయకు ప్రేక్షకులు పెద్ద షాక్ ఇచ్చారు . ఈమె పుష్ప మూవీలో సునీల్ భార్య పాత్రలో ఇరగదీసింది. ఇక అందరి కెరీర్‌లు పెళ్లి తర్వాత కంచికి చేరితే.. ఈమె కెరీర్ మాత్రం పెళ్లి తర్వాత మూడు ఆఫర్లు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగుతుండడం విశేషం.