Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

రోజూ శివ భ‌స్మాన్ని ధ‌రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Admin by Admin
March 6, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి. భస్మ స్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగును. బాహ్య ప్రపంచ జ్ఞానము కలుగును. విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిచుచుండిన లలాటమున్ బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారగును. విభూతి (భస్మం) ధరించినప్పుడు ఓం నమః శివాయా అను మంత్రమును జపించుచు ధరించవలెను. విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందికిగాని ధరించకూడదు. విభూతిధారణ దేవతాపూజ, జపము, యజ్ణ్జము, హోమము, శుభకార్యముల్లో ధరించిన కార్యములు సిద్ధించును. తప్పక ధరించవలెను. విభూతి భస్మం, తిలకం కాని నొసట ధరించనిదే భగవంతుని తీర్ధప్రసాదములు స్వీకరించ కూడదు. భస్మము ఐదు విధముల పేర్లతో ఉన్నట్లు తెలియచున్నది.

భస్మం, విభూతి, భసితము, క్షారము, రక్షయని పిలుస్తారు. 1. విభూతి కపిలవర్ణము, 2. భసితము కృష్ణ వర్ణము, 3. భస్మము శ్వేత వర్ణము, 4. క్షారము ఆకాశవర్ణము, 5. రక్ష రక్తవర్ణము కలిగి యుండును. బ్రహ్మాది దేవతలు నారదాది మహర్షులు సనక సనందనాది యోగులు బాణాసురాది దానవులు శివునిపై గల భక్తి భావములతో నిత్యం భస్మ స్నానమోనర్చి పాప విముక్తి పొందిరి. ఓం నమః శివాయ అను మంత్రముతో భస్మమును అభిమంత్రించి ఒడలిపై ధారణ చేయవలెను. త్రిపుండ్రములను ధరించవలెను. శిరమున, నుదుట‌న‌, కర్ణమున, కంఠమునందు, భుజములందు ఈ విధముగా పదునైదు తావులందు త్రిపుండ్రధారణ చేయవలెను. కుడిచేతి నడిమి మూడు వేళ్ళతో ఎడమ నుండి కుడివైపునకు, బొటన వేలుతో కుడినుండి ఎడమవైపునకు త్రిపుండ్రములను దాల్చ వలెను. శివపూజ సాధకులెల్లరును తప్పక ఈ విధముగా భస్మధారణ చేయవలెను.

what happens if you wear shiva bhasma daily

నిత్యము ఈ విధముగా ధరించడంవలన సమస్త పాపములు నశించును. గంగా, యమున, సరస్వతి సంగమ స్నానము వలన కలుగు ఫలితములు ఈ భస్మస్నానము వలన కలుగును. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలగు దేవతలు ఈ భస్మ స్నానము వలననే గొప్పవారైరి. త్రిపుండరేఖలలో త్రిమూర్తులు ఉన్నారు. మొదటి రేఖ బ్రహ్మ, రెండవ రేఖ విష్ణువు, మూడవ రేఖ శివుడు. కావున మూడు రేఖలను లలాటమున ధరించుట శ్రేష్టము. ఎల్లప్పుడూ కుడి చెయ్యి మధ్య మూడు వేళ్ళతో భస్మధారణ చేయవలెను. భస్మ స్నానము కంటే పవిత్ర స్నానము లేదని చెప్పుచూ శివుడు మొదట భస్మ ధారణచేసి సమస్త దేవతలకు ప్రసాదించెను. అనాటి నుండి బ్రహ్మాది సర్వ దేవతలు భస్మధారణ మహా ప్రసాదముగా స్వీకరించారు. చంద్రశేఖరుడైన శివునకు భస్మము అర్పించిన చాలా సంతసించును. యాగములు, దానములు, తపస్సు మొదలైన వానికంటే శివునకు భస్మధారన అధిక సంతృప్తినిచ్చును. ఒకసారి మహేశ్వరుని భస్మంతో తృప్తిపరిచిన సర్వాభీష్టములు నెరవేరును.

Tags: shiva bhasma
Previous Post

చేతికి క‌ట్టే ఈ ఎరుపు రంగు దారం ఎంత శ‌క్తివంత‌మైన‌దో తెలుసా..?

Next Post

రోజూ ద్రాక్ష పండ్ల ర‌సాన్ని తాగితే డ‌యాబెటిస్ దూరం..!

Related Posts

చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

June 13, 2025
ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడి సంతానం ఎవ‌రు.. వారి పేర్లు ఏమిటి..?

June 13, 2025
Off Beat

మ‌న జాతీయ ప‌తాకానికి సంబంధించిన ఈ నియ‌మాలు మీకు తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

మీకు అనారోగ్యం వ‌చ్చి త‌గ్గిన వెంట‌నే టూత్ బ్ర‌ష్‌ను మార్చాలి.. ఎందుకంటే..?

June 13, 2025
ఆధ్యాత్మికం

హ‌నుమాన్ ఆల‌యంలో ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది..?

June 13, 2025
lifestyle

అమ్మాయిలు ప్రేమలో ప‌డితే చేసే త‌ప్పులు ఇవే..!

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!