Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

హిందువులు ఎరుపు రంగుకు అత్యంత ప్రాధాన్య‌త‌ను ఎందుకు ఇస్తారో తెలుసా..?

Admin by Admin
June 21, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఎరుపు రంగు ప్రేమకు చిహ్నం. మీకు తెలుసా?…డెస్టినీ కలర్ కూడా ఎరుపే. అయోమయం చెందకండి. ఎరుపు రంగుకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎరుపు రంగుకి సంబంధించి ఎన్నో సర్ప్రైజింగ్ సీక్రెట్స్ ఉన్నాయి. అవన్నీ ఈ ఆర్టికల్ లో మీకు తెలియచేస్తాం. ఇక చదవండి మరి.. అందమైన రంగు ఎరుపు. హిందూయిజానికి చెందిన దాదాపు ప్రతి పండగలో అలాగే ఆచారంలో ఎరుపు రంగుకి అవినాభావ సంబంధముంది. హిందూ మతానికి చెందిన పెళ్లి వేడుకలలో ఎరుపు రంగుకి ఎంతో ప్రాధాన్యముంది. పెళ్లి కూతురి అలంకరణలో ఎరుపు రంగు విశేష పాత్ర పోషిస్తుంది. గమనిస్తే, కుంకుమ దగ్గర నుంచి పెళ్లి కూతురి అలంకరణకి సంబంధించిన ప్రతి అలంకరణలో ఎరుపు రంగు ప్రధానంగా ఉంటుంది. ఎరుపు రంగు కనులకు విందుగా ఉంటుంది. ప్రతి వ్యక్తిలో శక్తిని జేనేరేట్ చేయడానికి ఎరుపు రంగు తోడ్పడుతుంది.

మీలో దాగున్న భావోద్వేగాలను బయటపెట్టే శక్తి ఎరుపుకుంది. మీలో ఉన్న ప్రతిభా పాటవాలను అలాగే మీలో దాగున్న లక్ష్యాలను బయటకు తీసుకువచ్చే శక్తి ఎరుపు రంగుకుంది. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలలో ఎరుపుకుండే ప్రాధాన్యం అనిర్వచనీయం. ప్రతి శుభప్రదమైన వేడుకలలో ఎరుపుని తప్పక ఉపయోగిస్తారు. భారత్ లో ఎరుపుని పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. ఎరుపు రంగుకున్న ఖ్యాతి విశ్వవ్యాప్తమైనది. వ్యక్తిగత జీవితంలో గాని, నిర్దిష్ట సమయానికి గాని, ఒక స్థలం, చర్యకు ప్రతీకగా ఎరుపును చెప్పుకోవచ్చు. అయితే ఎరుపు ప్రాముఖ్యత వివిధ మతాలకు వేరు వేరుగా ఉన్నా ఎరుపుకున్న ప్రాముఖ్యత మాత్రం ప్రత్యేకతమైనది. ఇలా హిందూ నమ్మకాలలో ఎరుపు రంగు వాడకం వెనకున్న రహస్యాల గురించి తెలుసుకుందాం.. హిందూ సాంప్రదాయాలలో సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పార్వతీ దేవికి ప్రతీకగా సింధూరాన్ని భావిస్తారు.

why hindus will give importance to red color

హిందూ ఆస్ట్రాలజీ ప్రకారం మేష రాశి స్థానం నుదిటిపైన ఉంటుంది. మేష రాశి అధిపతి అంగారకుడు. అంగారకుడి రంగు ఎరుపు. అందుకే ఈ రంగుని శుభప్రదంగా భావిస్తారు. సౌభాగ్యానికి, అదృష్టానికి ప్రతీకగా ఎరుపు రంగును భావిస్తారు. అందువల్ల ఎరుపు రంగు అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. సాక్షాత్తు పరమశివుడి మూడవ కన్ను స్థానంగా భావిస్తున్న ప్రదేశంలో తిలకాన్ని దిద్దుతారు. అంతర్గత జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి తిలకాన్ని దిద్దుకుంటారు. అందువల్ల తిలకాన్ని దిద్దుకోవడానికి హిందువులు అమిత ప్రాధాన్యాన్నిస్తారు. ఎరుపు రంగుకు కామేచ్చను ప్రేరేపించే గుణముంది. అందువల్ల పెళ్లి వేడుకలలో తప్పని సరిగా వధువుకు ఎరుపు రంగుని అలంకరిస్తారు. ఆకలిని పెంపొందించడానికి ఎరుపు రంగు తోడ్పడుతుంది. అందుకే దాదాపు రెస్టారెంట్స్ అన్నింటినీ ఎరుపు రంగులో అలంకరిస్తారు.

విజయానికి సంకేతం ఎరుపు. అడ్వెంచర్, ప్రేమ, పవర్, ఆత్మ విశ్వాసం, ఏకాగ్రత, సంకల్పం, ఫ్లెక్సిబిలిటీ, ఉత్సాహం, లక్ష్యం మొదలగు వంటివి సాధించడానికి ఎరుపు రంగు తోడ్పడుతుంది. మరో కోణం ఎరుపు రంగుతో కేవలం ఉపయోగాలే కాదు కొంచెం ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తిలోని ప్రతికూల భావాలను ఎరుపు రంగు పెంచుతుందని అంటారు. శుభప్రదంగా భావించబడే ఎరుపు రంగుకి ఒక వ్యక్తికి చికాకు పుట్టించడం, ద్వేషాన్ని పెంచడం వంటి కొన్ని లక్షణాలు ఉంటాయని కొందరి అభిప్రాయం.

Tags: red color
Previous Post

క‌ర్ణుడి గురించి పూర్తి క‌థ మీకు తెలుసా..? ఆయ‌న స‌హ‌జ‌సిద్ధంగా క‌వ‌చ కుండ‌లాల‌తో ఎందుకు జ‌న్మించాడంటే..?

Next Post

కౌరవులు ఎలా జ‌న్మించారో తెలుసా..? అప్ప‌ట్లోనే IVF ప‌ద్ధ‌తిని వాడార‌న్న‌మాట‌..?

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.