Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

కౌరవులు ఎలా జ‌న్మించారో తెలుసా..? అప్ప‌ట్లోనే IVF ప‌ద్ధ‌తిని వాడార‌న్న‌మాట‌..?

Admin by Admin
June 21, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మహాభారతం…ఈ అత్యద్భుతమైన పురాణగాథను ఎంత తవ్వితే అన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనకి తెలుస్తాయి. అటువంటి ఒక మిస్టరీ గురించి మనం తప్పక తెలుసుకోవాలి. ఈ పురాణ గాధలో ప్రస్తావించబడిన కొన్ని సంఘటనలు ఎన్నో సందేహాలను కలిగిస్తాయి. ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తాయి. ముఖ్యంగా గాంధారి అనే పాత్ర మరిన్ని సందేహాలను కలిగిస్తుంది. గాంధారికి నిజంగా 101 మంది సంతానమున్నారా అనే ప్రశ్న మహాభారతాన్ని చదివిన ప్రతి ఒక్కరిలో తప్పక ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఈ ఇతిహాసంలో అయిదుగురు అన్నదమ్ములైన పాండవులలో ముగ్గురు కుంతీ దేవికి జన్మించారని, మరో ఇద్దరు పాండు రాజు రెండవ భార్య అయిన మాద్రికి జన్మించారని చెప్పబడి ఉంది. అయినప్పటికీ, కౌరవుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కౌరవులు వందమంది అన్నదమ్ములని వారికి ఒక సోదరి ఉన్నదని అంటారు.

ఈ నిజం కొంచెం నమ్మశక్యంగా అనిపించదు?. ప్రకృతి స్వభావాన్నే తీసుకుంటే ఒక బిడ్డకు జన్మనివ్వడానికి దాదాపుగా తొమ్మిది నెలల సమయం పడుతుంది. కాబట్టి, ఒక ప్రసవంలో ఒక గాంధారి ఒక్కొక్క సంతానాన్ని ప్రసవించిందని అనుకుంటే ఆమె నూరవ సంతానానికి జన్మనిచ్చే సమయంలో ఆమె మొదటి సంతానానికి కనీసం 75 సంవత్సరాలుంటాయి. అంటే, అప్పటికి గాంధారి వయసు ఎంత ఉండవచ్చన్నది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఒక వేల ఆమె కవలల్ని అలాగే ఒకే ప్రసవంలో ముగ్గురు పిల్లల్ని, నలుగురు పిల్లల్ని ప్రసవించిందని అనుకున్నా మహాభారత యుద్ధం అంతమయ్యేవరకు ఆమె జీవించి ఉండడం అసాధ్యమని చెప్పవచ్చు. ఒకవేళ 101 మంది సంతానాన్ని ఆమె ఒకే ప్రసవంలో కన్నాదని అనుకుందామన్న వారందరూ బ్రతికి ఉండే అవకాశాలు దాదాపు లేనట్లే. మరి ఇదెలా సాధ్యం?

how kauravas were born ivf was used then

కౌరవులనబడే 100 మంది నిజంగా ఉండేవారా? లేదా ఇదేమైన మిరాకిల్ ద్వారా సంభవించినదా? మనకు తెలియని ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఉంటారా? ఈ ప్రశ్నలన్నీ దాదాపు కొంచెం ఆందోళనని కలిగించేవే. ఒకసారి ఈ ఇతిహాసం గాంధారి 101 సంతానం గురించి ఏమని చెప్తుందో చూద్దాం. మహాభారత ఇతిహాస రచయిత వ్యాస మహర్షి గాంధారి సేవలకు సంతుష్టుడై ఆమెకి ఒక వరాన్ని ప్రసాదించాడు. 100 మంది కొడుకులకు జన్మనిచ్చే వరాన్ని ఆమెకు ప్రసాదించాడు. ఆ రోజుల్లో ఇటువంటి వరాలు కొంచెం సాధారణమేనని కొన్ని ఇతిహాసాల ద్వారా అర్థమవుతుంది. గాంధారి విషయంలో కచ్చితంగా 100 మంది సంతానం వ్యాస మహర్షి ఇచ్చిన వరమని అంటారు. కురు వంశానికి చెందిన ధృతరాష్ట్రుడుని గాంధారి వివాహమాడింది. అయితే, చిన్నతనం నుంచే ధృతరాష్ట్రుడు అంధుడు కావడం చేత రాజ్యాన్ని పాలించే అవకాశం అతని తమ్ముడు పాండు రాజుకు దక్కింది.

ఈ నిజం ధృతరాష్ట్రుడితో పాటు ఆయన భార్య గాంధారిని కూడా బాగా మనస్తాపానికి గురి చేసింది. అందువల్ల పాండురాజు- కుంతీల కంటే ముందుగా పిల్లల్ని కనాలని ఆశించేవారు. తద్వారా, తమ కుమారుడే రాబోయే కాలంలో రాజవుతాడని ఆశించారు. కుంతి కంటే ముందు గర్భం దాల్చినందుకు గాంధారి ఎంతో ఆనందం చెందింది. కాని, ఇంతలోగా దురదృష్టం ఆమెను వెంటాడింది. ఆమె కలలను కల్లలు చేసింది. రెండేళ్ళ పాటు జన్మనివ్వలేకపోయింది. మరోపక్క కుంతీ తన మొదటి కుమారుడికి జన్మనిచ్చింది. దీంతో, గాంధారి ఒక్కసారిగా తన ఆగ్రహాన్ని అణచుకోలేకపోయింది. తన గర్భంపై పదే పదే కొట్టుకుని తనను హింసించుకుంది. ఆగ్రహంతో గాంధారి తనను తాను విపరీతంగా హింసించుకోవడం వల్ల ఆమె ఒక మాంసపు ముద్దకు జన్మనిచ్చింది. దీంతో వ్యాస మహర్షిని అక్కడకు పిలిపించారు. వెంటనే వంద నేతి సీసాలను తెప్పించమని వ్యాస మహర్షి ఆదేశించారు. ఆ సమయంలో గాంధారి తనకు అమ్మాయి కూడా కావాలన్న కోరికను వ్యక్తపరిచింది.

వంద సీసాలు సిద్ధం కాగానే, వ్యాస మహర్షి మాంసపు ముద్దను వంద భాగాలుగా విభజించి ఒక్కొక్క ముద్దను ఈ సీసాలలో ఉంచారు. ఈ సీసాలను భద్రపరచమని గాంధారికి సూచించారు. ఆ విధంగా గాంధారి 100 మంది కొడుకులకు, ఒక కుమార్తె(దుశ్శాల)కు జన్మనిచ్చింది. గాంధారి సంతానజన్మరహస్యానికి సంబంధించి ఎంతో మంది ఎన్నో థియరీస్ తో ముందుకొచ్చారు. కాని, కొన్ని మాత్రమే అందులో సరైనవిగా అనిపిస్తాయి. అటువంటి ఒక థియరీ ఇన్-విట్రో ఫెర్టిలైసేషన్(IVF). ఈ పద్దతి ప్రస్తుత కాలంలో ఎంతో ప్రాధాన్యతను పొందింది. వ్యాస మహర్షికి ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన విజ్ఞానం ఉన్నాదని ఈ థియరీ చెప్తోంది. అందువల్లే గర్భస్థ పిండాలను సీసాలలో పెట్టి వాటి ఎదుగుదలకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడాని అంటారు.ఈ థియరీలో చెప్పబడిన విషయాలు నమ్మశక్యంగా లేవని ఎన్నో విమర్శలున్నాయి. ఇంకొక సిద్ధాంతం ప్రకారం గాంధారికి దుర్యోధన, దుశ్శాసనలనే ఇద్దరే సంతానం. వీరి గురించే మహాభారతంలో ఎక్కువగా ప్రస్తావించబడి ఉంది. అయితే, అక్కడక్కడా కౌరవుల ప్రస్తావనలో వికర్ణ, యుయుస్తు అనే పేర్లు పేర్కొనబడినవి. అయితే, వీరిలో ఎక్కువగా పాండవులకు అనుకూలభావనలు ఎక్కువగా ఉండేవని అంటారు. అందువల్ల, ఈ సిద్ధాంతాన్ని కూడా నమ్మలేమనే విమర్శలున్నాయి.

Tags: kauravas
Previous Post

హిందువులు ఎరుపు రంగుకు అత్యంత ప్రాధాన్య‌త‌ను ఎందుకు ఇస్తారో తెలుసా..?

Next Post

కమెడియన్ అలీ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Related Posts

lifestyle

పొరపాటున కూడా బంధువులకి చెప్పకూడని 5 సీక్రెట్స్ !

July 9, 2025
ఆధ్యాత్మికం

ఉల్లి, వెల్లుల్లిని బ్రాహ్మణులు ఎందుకు తిన‌రు..?

July 9, 2025
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

July 9, 2025
lifestyle

ఆకుకూర‌లు లేదా కూర‌గాయ‌ల‌ను ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి..!

July 9, 2025
information

ఇనుము తుప్పు పడుతుంది.. మరి రైలు పట్టాలు తుప్పు పడతాయా లేదా?

July 9, 2025
పోష‌ణ‌

ఈ సీజ‌న్‌లోనే కనిపించే కాయ‌లు ఇవి.. విడిచిపెట్ట‌కుండా తినండి..!

July 9, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.