Ram Prasad : ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది పాపులర్ అయ్యారు. కొందరు ఎంతో పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకున్నారు. షకలక శంకర్, సుడిగాలి సుధీర్, గెటప్ శీను ఏకంగా హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక బలగం సినిమాతో వేణు యెల్దండి క్రేజీ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. ఇలా తన దైన ఆటో పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఆటో రామ్ ప్రసాద్ కూడా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. నటుడిగాను అలరిస్తున్న రామ్ ప్రసాద్ త్వరలో డైరెక్టర్‌గా కూడా మారబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.
ఇక ఇదిలా ఉంటే జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. అతను ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ కావడంతో జబర్దస్త్ నటుడికి గాయాలయినట్టు సమాచారం.. ఎప్పటిలాగానే గురువారం (డిసెంర్ 05) షూటింగ్ కు వెళుతుండగా తుక్కుగూడ సమీపంలో ఆటో రాంప్రసాద్ ముందున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ తరుణంలోనే… జబర్దస్త్ కమెడియన్ కారును వెనక నుంచి ఆటో ఢీ కొట్టడం, ఆ తర్వాత రాంప్రసాద్ కారు ముందు ఉన్న మరో కారుని ఢీ కొట్టడంతో రాంప్రసాద్ కి స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటన పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే రామ్ ప్రసాద్‌కి యాక్సిడెంట్ జరిగిందన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆటో రాం ప్రసాద్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా, ఆటో రామ్ ప్రసాద్ తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులతో కలిసి జబర్దస్త్ వేదికపై నాన్ స్టాప్ నవ్వులు కురిపిస్తాడు.జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్, ఆటో రాం ప్రసాద్, గెటప్ శీను మంచి దోస్తులు. వీరి మధ్య మంచి రిలేషన్ షిప్ కూడా ఉంది. అంతేకాదు సుడిగాలి సుధీర్ స్కిట్లకు స్క్రిప్ట్ రాసేది కూడా ఆటో రాం ప్రసాద్. అలా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు.