Bahubali : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీ ఎంతటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెండు పార్ట్‌లుగా వచ్చి అలరించింది. రెండో పార్ట్ అత్యధిక స్థాయిలో కలెక్షన్లను సృష్టించి భారతీయ చలనచిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసింది. ఇందులో ముఖ్యంగా కట్టప్ప అసలు బాహుబలిని ఎందుకు చంపాడు.. అనే విషయాన్ని తెలుసుకునేందుకే చాలా మంది ఈ మూవీని వీక్షించారు. ఈ మూవీ విమర్శల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఈ మూవీని ఇప్పటికే మనం చాలా సార్లు చూశాం. కానీ ఇందులో ఉన్న చిన్న చిన్న తప్పులను మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాం. అలాంటి ఒక తప్పు గురించే ఇప్పుడు చెప్పబోయేది. ఇంతకీ అదేమిటంటే..
బాహుబలి మూవీ మొదటి పార్ట్‌లో ఆరంభంలో శివుడు అవంతికను వెదుక్కుంటూ వెళతాడు. ఓ దశలో ఇద్దరూ కలుసుకుని దగ్గరవుతారు. ఆ సమయంలో వారు శారీరకంగా ఒక్కటవుతారు. దీన్ని దర్శకుడు పాటలో చూపించారు. పచ్చ బొట్టేసినా అనే పాటలో ఇదంతా జరుగుతుంది. అయితే అదే పాటలో చివర్లో నీలం రంగు దుస్తులు ధరించిన అవంతిక ఎద వస్త్రం వెనుక వైపు ముందుగా ముడి ఉండదు. పాటలో దాన్ని స్పష్టంగా చూడవచ్చు. కానీ ఇంకో సీన్‌లో అదే వస్త్రానికి ఆమె ముడి విప్పుతుంది. దాన్ని ఆమె వెనుక నుంచి చూడవచ్చు. ఇది సినిమాలో చాలా చిన్న మిస్టేక్. కానీ దీన్ని ఎవరూ గమనించలేదు.
ఇలా సినిమాల్లో దుస్తుల విషయంలో పొరపాట్లు జరగడం సహజమే. దీన్ని చాలా మంది గమనించరు. కానీ చాలా ఎక్కువ సార్లు ఏదైనా మూవీని చూస్తే అందులో ఉండే చిన్న చిన్న తప్పులు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి. వాటిని మనం వెదికి పట్టుకున్నప్పుడు అదో రకమైన సంతృప్తి భావన కలుగుతుంది. అయితే ఇలాంటి చిన్న చిన్న తప్పులు ఉంటే సినిమాకు వచ్చే నష్టమేమీ ఉండదు. కానీ పెద్ద తప్పులు చేస్తే సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలం అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుకనే దర్శకులు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సునిశితంగా గమనిస్తూ సినిమాలు తీస్తుంటారు. దీంతో చాలా వరకు తప్పులు రావు. కానీ అనుకోకుండా లేదా చూడకుండా వస్తే ఏమీ చేయలేరు.