Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

బాల‌కృష్ణ త‌న కెరీర్‌లో వ‌దులుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు ఇవే.. ఇవి గానీ చేసి ఉంటేనా..?

Admin by Admin
March 16, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ ఫుల్ యాక్షన్ కి ఇప్పటికి ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్ అంటే నందమూరి బాలకృష్ణ గారే. అంత బలమైన డిక్షన్ లేదా డైలాగ్ డెలివరీని మ్యాచ్ చేయటం చాలా కష్టం. 40 ఏళ్ల కెరీర్‌లో బాలయ్య ఎన్నో రకాల పాత్రలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ తరువత, ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొట్టడం రికార్డ్. థానా 100వ సినిమాగా 56 ఏళ్ల చరిత్ర కలిగిన సినిమా, గౌతమి పుత్ర శాతకర్ణిలో వార్ సీక్వెన్స్‌లు చేయడం, ఆయ‌న కష్టపడి పనిచేసే నేచర్‌కి ఒక సూచన. జానకి రాముడు సినిమాను ముందుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య చేయాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల కోడి రామకృష్ణ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో బాలయ్య ఈ సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఈ సినిమా తెరకెక్కి సూపర్ హిట్ అయింది.

తమిళంలో పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమాను తెలుగులో బాలయ్య తో రీమేక్ చేయాలని అనుకున్నారు పరుచూరి బ్రదర్స్. బాలయ్యకు కథ కూడా చెప్పారు. అయితే చివరగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన చంటి సినిమా సూపర్ హిట్ అయింది. రాజశేఖర్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచి, రాజశేఖర్ కెరీర్ టర్న్ చేసిన సింహరాశి సినిమాను దర్శకుడు సముద్ర ముందుగా బాలయ్యతో చేయాలని అనుకున్నారు. అయితే బాలయ్యకు రీమేక్ సినిమా చేయటం ఆ టైంలో ఇష్టం లేదు. దీంతో రాజశేఖర్ ఈ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టారు. హరికృష్ణ, జగపతిబాబు, శివాజీ కలిసి నటించిన శివరామరాజు సినిమాలో హరికృష్ణ పాత్రకు ముందుగా బాలయ్యను సంప్రదించారట. అయితే అప్పుడు తనకు ఇలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదని బాలయ్య తప్పుకోవడంతో హరికృష్ణకు ఆ పాత్ర దక్కింది.

balakrishna rejected these top 10 block buster movies

సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన అన్న‌వ‌రం సినిమా కథను తాను గతంలోనే కొన్ని సినిమాల్లో చేశానని బాలయ్య భావించడంతో ఈ కథ వదులుకున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా త్రిష హీరోయిన్ గా తెరకెక్కిన రీమేక్ సినిమా బాడీగార్డ్ ను బాలయ్య తో చేయాలని నిర్మాత బెల్లంకొండ సురేష్ అనుకున్నారు. అసలు ఈ రీమేక్ కథను బాలయ్య కోసమే ఆయన కొనుగోలు చేశారు. బాలయ్య తప్పుకోవడంతో చివరకు వెంకటేష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. అసలు పదేళ్ల క్రితమే పరుచూరి బ్రదర్స్ రాసిన కథ ఆధారంగా బాలయ్య సైరా సినిమాను చేయాలి. మధ్యలో ఎన్టీఆర్ పేరు కూడా వినిపించింది. చివరకు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా వచ్చింది. మలినేని గోపి డైరెక్షన్లో రవితేజ హీరోగా చేసిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అయింది. బాలయ్య కు రొటీన్ మాస్ యాక్షన్ కథలు చాలా చేసి ఉండడంతో క్రాక్ నచ్చలేదు. చివరకు రవితేజ ఈ సినిమా చేశాడు.

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సింహాద్రి కథ ముందుగా బాలయ్య దగ్గరకే వెళ్లింది. బాలయ్య హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో చేయాలని విజయప్రసాద్ అనుకున్నారు. అప్పుడు బాలయ్య పలనాటి బ్రహ్మనాయుడు సినిమా చేస్తుండడంతో ఇది వదులుకున్నారు.

Tags: Balakrishna
Previous Post

పురుషుల్లో ఉత్ప‌న్న‌మ‌య్యే వీర్యం నాణ్య‌త‌ను ఇలా తెలుసుకోవ‌చ్చు..!

Next Post

ఈ ద‌ర్శ‌కుల‌కు త‌మ కెరీర్‌లో ఫ్లాప్ అంటే తెలియ‌దు..!

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.