దంపతుల్లో స్త్రీ, పురుషులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నప్పడే, వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థలు సరిగ్గా పనిచేసినప్పుడు పిల్లలు త్వరగా కలిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే స్త్రీల మాట అటుంచితే ప్రధానంగా పురుషుల్లో వీర్యం నాణ్యంగా ఉన్నప్పుడే సంతానం కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. వీర్యంలో శుక్ర కణాలు ఏమాత్రం యాక్టివ్‌గా లేకపోయినా, లేదంటే ఉండాల్సిన సంఖ్య కన్నా శుక్ర కణాలు తక్కువగా ఉన్నా దాంతో సంతానం అంత ఈజీగా కలగదు. అలాంటప్పుడు వారు సరైన సూచనలు పాటించి సంతానం పొందవచ్చు. అయితే వీర్యం విషయానికి వస్తే అది ఏ పురుషునిలో అయినా యాక్టివ్‌గా ఉందా లేదా? అని తెలుసుకోవడం ఎలా..? అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. వెడల్పయిన భుజాలు, చతురస్రాకారంలో ఉండే దవడలు కలిగిన పురుషుల్లో వీర్యం నాణ్యంగా ఉండదట. యావరేజ్‌గా ఉండే పురుషుల్లోనే వీర్యం నాణ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందట.
బిగుతైన అండర్‌వేర్లు, ప్యాంట్లు ధరించే వారిలో వీర్యం నాణ్యంగా ఉండదట. దీంతోపాటు శుక్ర కణాల సంఖ్య కూడా తగ్గుతుందట. ప్లాస్టిక్ పాత్రలను అస్సలు ఉపయోగించకూడదట. అలా ఉపయోగిస్తే వీర్యం నాణ్యత తగ్గిపోతుందట. సాధారణ పాత్రల్లో తినేవారికే వీర్యం నాణ్యంగా ఉంటుందట. చికెన్, మటన్ వంటి మాంసం కన్నా చేపలు ఎక్కువగా తినే వారిలోనే వీర్యం నాణ్యంగా ఉంటుందట. దాంతోపాటు శుక్ర కణాల సంఖ్య కూడా అలాంటి వారిలోనే ఎక్కువగా ఉంటుందట. వ్యాయామం చేయని వారిలో వీర్యం సరిగ్గా ఉండదట. నిత్యం 1 గంట పాటు వ్యాయామం చేసే వారిలో వీర్యం నాణ్యంగా ఉండడమే కాదు, శుక్రకణాలు బాగా ఉత్పత్తి అవుతాయట, అవి బాగా యాక్టివ్‌గా కూడా ఉంటాయట.
బొడ్డు దగ్గర కొవ్వు, అధిక పొట్ట ఉన్న వారిలో వీర్యం నాణ్యంగా ఉండదట. వారిలో శుక్ర కణాల సంఖ్య కూడా తగ్గుతుందట. ఇక చివరిగా గొంతు (టోన్) తక్కువగా ఉన్న పురుషుల్లో వీర్యం నాణ్యంగా ఉండదట. వారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలు తక్కువగా ఉంటాయట. అందుకే వీర్యం తక్కువగా ఉత్పత్తి అవుతుందట. అంతేకాదు, అందులో శుక్ర కణాలు అస్సలు ఉండవట.