టాలీవుడ్ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాలతో ఎందరినో స్టార్లుగా మలిచినగొప్ప దర్శకుడు శంకర్. సాధారణ కథానాయికల్ని కూడా అసాధారణ విజువల్ బ్రిలియెన్సీ తో జాతీయస్థాయి గుర్తింపును తెగలిగిన నిపుణుడు. టాలీవుడ్ లో, బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని కోరుకునే స్థాయికి శంకర్ ఎదిగారు. టెక్నాలజీ మీద ఆయనకి ఉన్న పరిజ్ఞానం, విజన్ ఇండియాలో ఏ స్టార్ డైరెక్టర్ కి లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ఇండియన్ 2 సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ప్రొఫెషనల్ పరంగా ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు శంకర్. ఈయనకి ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు అన్న విషయం తెలిసిందే. ఇద్దరు కూతుర్ల లో ఓ కూతురు అదితి శంకర్ కి సినిమా హీరోయిన్ కావాలని కోరిక. కానీ శంకర్ కి తన కూతురు హీరోయిన్ అవ్వడం అసలు ఏ మాత్రం ఇష్టం లేదట. కానీ కూతురు అదే పనిగా పట్టుబట్టి బ్రతిమిలాడడంతో కాదనలేక ఒకే ఒక్క షరతు మీద ఒప్పుకున్నారట. ఈ విషయాన్ని అదితి శంకర్ ఓ వేదికపై స్వయంగా పేర్కొంది.
అయితే హీరోయిన్ గా సక్సెస్ కాకపోతే మళ్ళీ వైద్య వృత్తిని చేపడతానని తండ్రికి నచ్చజెప్పి, ఒప్పించి నటిగా విరుమాన్ చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసింది అదితి. తమిళ స్టార్ హీరో కార్తీతో కలిసి అదితి నటించిన విరుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ కలెక్షన్లను సాధించింది. అలా హీరోయిన్ గా అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టడంతో అదితి శంకర్ ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. ఇక శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన గేమ్ ఛేంజర్ మూవీ కూడా డిజాస్టర్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆయన భవిష్యత్తు ప్రాజెక్టులపై నీలి నీడలు కమ్ముకున్నాయి.