Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Silk Smitha : ప‌ల్లెటూరి నుంచి వ‌చ్చిన సిల్క్ స్మిత‌.. అస‌లు ఆమెకు ఆ పేరు ఎలా వ‌చ్చింది..?

Admin by Admin
December 8, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Silk Smitha : సిల్క్ స్మిత‌.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కులకు తెలిసిందే. ఎన్నో సంవత్స‌రాల పాటు ఈమె తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఐట‌మ్ భామ‌గా, న‌టిగా మెరిసింది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల అర్థాంత‌రంగా త‌నువు చాలించింది. ఈమె బ‌యోపిక్‌ను వెండితెర‌పై తీశారు కూడా. అయితే ప‌ల్లెటూరి నుంచి వ‌చ్చిన అమ్మాయి సిల్క్ స్మిత‌గా ఎలా స్టార్ అయింది.. అస‌లు ఆమె సినిమా ప్ర‌వేశం ఎలా జ‌రిగింది.. త‌దిత‌ర వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సిల్క్ స్మిత అస‌లు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. ఏలూరులో జన్మించిన ఈమె తండ్రి రాములు, తల్లి నర్సమ్మ. ఆర్థిక స‌మ‌స్య‌ల‌ వల్ల విజయలక్ష్మిని 5వ తరగతిలోనే చదువు మానిపించారు. 14 ఏళ్లకే పెళ్లి చేశారు. కానీ భర్త, అత్తమామలు ఆమెను ఎప్పుడూ హింసించేవారు. తన కష్టాలను మేనత్తకు చెప్పుకోగా.. ఏదో ఒక పని ఇప్పిస్తా అని ఆమెను చెన్నైకి తీసుకువచ్చింది మేనత్త. అక్కడ తనకు తెలిసిన‌ వారితో మేకప్ వేయించడం నేర్పించడంతో జూనియర్ ఆర్టిస్టులకు మేకప్‌ చేసుకుంటూ గడిపేది. కానీ ఒక‌రోజు నిర్మాత విను చక్రవర్తి భార్య షూటింగ్ జరిగే దగ్గర సిల్క్ స్మిత‌ను చూసి ఈమె నటి అయితే బాగుంటుంది అని ఆమెను అడిగారు. ఆమె కూడా ఒప్పుకోవడంతో రెండు నెలలు తమ వ‌ద్ద పెట్టుకుని నటన, డ్యాన్స్ కెమెరా ముందు ఎలా ఉండాలి అనేది నేర్పించారు. ఆ తర్వాత స్మిత అని పేరు మార్చి సినిమాలో అవకాశం ఇచ్చారు.

do you know how silk smitha got that name

అయితే చక్రవర్తి సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో నటించిన స్మిత కు పేరు వచ్చి.. అది అలానే కొనసాగింది. కానీ ఆ తర్వాత కొంత మంది డబ్బు ఆశ చూపించి కేరళ తీసుకెళ్లి బి గ్రేడ్ సినిమాల్లో నటింపజేశారు. ఆ తర్వాత కూడా మిగితా సినిమాలో అవకాశాలు దకించుకున్న సిల్క్ స్మిత ఐటం గర్ల్ గా అలాగే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంతలా అంటే అప్పుడు చిరంజీవి కూడా సిల్క్ స్మిత వస్తుంది అంటే లేచి నిలుచొని విష్ చేసేవాడు.

నటిగా పేరు బాగా సంపాదించిన‌ సిల్క్ స్మిత డబ్బు కూడా బాగానే సంపాదించింది. కానీ చదువు రాకపోవడంతో వేరే వారిపై ఆధార పడటం.. వారు మోసం చేయడం జరిగింది. ఇలాగే సిల్క్ స్మిత ఫైనాన్షియర్ కూడా ఆమెకు ప్రేమ పేరుతో దగ్గరై మొత్తం డబ్బుతో పరారయ్యాడు. ఆ మోసాన్ని తట్టుకోలేకపోయిన సిల్క్ స్మిత బాగా కుంగిపోయింది. నటిగా క్రేజ్ తగ్గకపోయినా.. సినిమాల‌లో నటించలేదు. అప్పుడే తాగుడుకు బానిసైన సిల్క్ స్మిత 23 సెప్టెంబర్ 1996 న ఆత్మహత్య చేసుకుంది. అలా ఆమె అర్థాంత‌రంగా త‌నువు చాలించింది. ఇప్ప‌టికీ ఆమె డ్యాన్స్‌ను ఆస‌క్తిగా తిల‌కిస్తుంటారు.

Tags: silk smitha
Previous Post

నాలుగైదు గెస్ట్‌ హౌస్‌లు మార్చుతూ ప్రత్యూషపై అత్యాచారం చేశారు.. తల్లి సరోజినీ దేవి సంచలన కామెంట్స్‌..

Next Post

Post Office Scheme : రోజుకు రూ.167 పెడితే.. రూ.16 లక్షలు మీవే..!

Related Posts

lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025
ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.