Soundarya : తెలుగు సినీ పరిశ్రమలో అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటి సౌందర్య. తెలుగులో పాటు ఇతర భాషల్లో వందకు పైగా సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హోమ్లీ రోల్స్ లో మాత్రమే నటించి సౌందర్య విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం అనే చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపుగా అప్పట్లో స్టార్ స్టేటస్ అందుకున్న హీరోలకు జోడీగా సౌందర్య నటించి అలరించింది. ఇక ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న స్టార్ హీరోయిన్లలో సౌందర్య ఒక్కరు అని చెప్పొచ్చు.
సౌందర్య ప్రతి పాత్రకు ప్రాణం పోసినట్టు నటించేది. సౌందర్య ఎలాంటి పాత్ర పోషించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి అందరి దగ్గరి నుండి ప్రశంసలను అందుకున్నారు. సౌందర్యకి ఛాన్స్ వస్తే దర్శకత్వం కూడా వహించాలని అనుకున్నారు. కానీ.. దర్శకత్వం చేయాలనే కోరిక తీరకుండానే సౌందర్య మృతి చెందారు. సౌందర్య చివరి సినిమా నర్తనశాల కాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ సమయానికి సౌందర్య మృతి చెందారు. ఇక సౌందర్య గెలుపు అనే సినిమాలో నటించగా ఈ సినిమా షూటింగ్ పూర్తైనా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల కాలేదు.
ఇండస్ట్రీలో సౌందర్య ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎంతో ఎదిగారు. 25,000 రూపాయల రెమ్యునరేషన్ నుంచి 50 లక్షల రూపాయల పారితోషికం స్థాయికి ఎదిగారు. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, హిందీ భాషలలో కూడా సౌందర్య హీరోయిన్ గా నటించి మెప్పించింది. అంతేకాదు సౌందర్య ఒకానొక టైం లో ఏడాదికి పది చిత్రాలు నటించిన క్రెడిట్ కూడా దక్కింది. సౌందర్య తండ్రి సత్యనారాయణ జ్యోతిష్యుడు కాగా, ఆయన 2004లోనే సౌందర్య కెరియర్ అర్ధాంతరంగా ముగుస్తుందని ఆయన ముందే చెప్పారట.