Balakrishna : సినిమా రంగంలో చాలామంది పెద్ద స్థాయికి రావటానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్టార్ హీరో హోదాకి చేరుకుంటారు. ఒక హీరో స్టార్ గా ఎదగడానికి ఆయన గత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉంటారు. వారికి ఉన్న టాలెంట్ తో కోట్ల రూపాయలు సంపాదించి ఉన్న సంపాదనలో నలుగురికీ సాయం చేస్తూ ఉంటారు. స్టార్ హీరోస్ లో ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు నట సార్వభౌమడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ పుట్టుకతో ఏమీ కోటీశ్వరుడు కాదు. తన సొంత టాలెంట్ తో నట సార్వభౌముడుగా ఎదిగారు.
ఆయన తరహాలోనే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చారు మురళీ మోహన్. ఈయన కూడా ఎంతో క్రమశిక్షణతో ఎన్టీఆర్‌ను ఫాలో అయ్యి.. స్టార్ హీరోగా ఎదిగారు. హీరోగా రాణిస్తూనే జయభేరి సంస్థను స్థాపించి అనేక సినిమాలను నిర్మించాడు. మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూ ద్వారా ఎన్టీఆర్, బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత నాతో పాటు కొంతమంది ఎన్టీఆర్ ని ఓ నైట్ కలవడానికి వెళ్లాము. ఆ సమయంలో ఎన్టీఆర్ రండి బ్రదర్ భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అన్నారు. ఎన్టీఆర్ తో కలిసి అందరం కడుపు నిండా భోజనం చేశాము. ఆ తర్వాత షూటింగ్ విశేషాలు గురించి మాట్లాడుకుంటూ మధ్యలో ఎన్టీఆర్ ఐస్ క్రీమ్ తిందామా బ్రదర్ అన్నారు. సరే అని చెప్పడంతో ఓ పిల్లాడిని పిలిచి 7 ఐస్ క్రీమ్ లకు ఎంత డబ్బు అవుతుందో చిల్లరతో సహా లెక్కపెట్టి ఇచ్చారు. అది చూసి నాకు నవ్వు రావడంతో.. మురళీ ఎందుకు నవ్వుతున్నావ్ అని ఎన్టీఆర్ నన్ను అడగడం జరిగింది. చిల్లర లెక్క పెట్టే బదులు ఒక రూ.100 ఇస్తే చిల్లర తిరిగి తీసుకువస్తాడు కదా సార్ అని అన్నానని తెలిపారు మురళి మోహన్. దాంతో ఎన్టీఆర్ ఇది నేను కష్టపడి సంపాదించిన డబ్బు. డబ్బు ఖర్చు చేసే విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పారన్నారని మురళీమోహన్ తెలియజేశారు.
నేను పాలు పోసి జీవనం సాగించే ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను. విజయవాడలో ఉదయాన్నే లేచి పొద్దునే పాలు పోసి గుంటూరు వెళ్లి కష్టపడి చదువుకున్నాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు కోట్ల సంపాదన ఉంది కదా అని ఎలా పడితే అలా ఖర్చు పెట్టను. ఒక పది రూపాయలు కూడా ఆచితూచి ఖర్చు చేస్తాను అని ఎన్టీఆర్ చెప్పారని మురళీ మోహన్ తెలియజేశారు.
కానీ నా కొడుకు బాలకృష్ణ పుట్టినప్పుడే కోటీశ్వరుడు, ఒక పెద్ద స్టార్ ఇంట్లో పుట్టాడు. ఎవరైనా వరద సాయం కోసం బాలయ్య దగ్గరకు వెళితే వెంటనే రూ.1లక్ష లేక రూ.2 లక్షలు ఇస్తాడని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారని తెలిపాడు. మనం సంపాదించిన డబ్బు సద్వినియోగం అవ్వాలి కానీ, దుర్వినియోగం అవ్వకూడదు అని తెలియజేశారు. అలా ఎన్టీఆర్, బాలయ్య బాబుల ఖర్చుల విషయంలో ఆశ్చర్యపోయానని మురళీమోహన్ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.