తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం మనం ఇప్పటివరకు చూసాం. అంతేకాకుండా ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే కథతో , ఒకే స్టోరీ లైన్ తో రావడం ఇప్పటివరకు చూసి ఉండం. కానీ ఈ హీరోల సినిమాలు వచ్చాయి.. 1989వ సంవత్సరం జూన్ 26వ తేదీన వెంకటేష్ హీరోగా చేసిన ధ్రువ నక్షత్రం సినిమా రిలీజ్ అయింది.
అదేరోజు బాలయ్య నటించిన అశోక చక్రవర్తి మూవీ రిలీజ్ అయింది. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే రెండు చిత్రాల స్టోరీలు ఒకటే. ఈ సినిమాలను చూసిన జనాలు రెండు స్టోరీలు ఒకే విధంగా ఉన్నాయని ఆశ్చర్యపోయారు. కానీ రెండు సినిమాలు హిట్ కాలేదు. యావరేజ్ గా నిలిచాయి. ఈ రెండు చిత్రాలు ఒకే స్టోరీ లైన్ తో ఉన్నాయని సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు ఎవరికీ తెలియలేదు.
ఈ విధంగా యాదృచ్ఛికంగా జరిగిన ఈ సంఘటన అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీతో వెంకీ మళ్లీ హిట్ కొట్టగా.. డాకు మహారాజ్ మూవీతో బాలయ్య మరోమారు మాస్ ఇమేజ్ సత్తా చాటారు.