Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

మ‌హాభార‌తంలో కీల‌క‌పాత్ర పోషించిన 10 మంది ముఖ్య‌మైన మ‌హిళ‌లు వీరే..!

Admin by Admin
July 8, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మహాభారతంలో పది అందమైన స్త్రీలలో ద్రౌపది లేదా పాంచాలి తప్పక ఉండి తీరుతుంది. పాంచాల దేశపు మహారాజయిన ద్రుపదుని కుమార్తె ఈమె. మహాభారతం రెండో సగంలో ఆమె పోషించిన పాత్ర శ్లాఘనీయం. అర్జునుడు ఆమెని స్వయంవరంలో గెలిచినా చివరికి ఐదుగురు పాండవులకీ ఉమ్మడి పత్ని అయ్యింది ఈమె. ద్రౌపదిఎప్పుడూ నమ్మి పూజించే శ్రీకృష్ణుడే ఈమెని నిండు కౌరవ సభలో వస్త్రాపహరణం సమయంలో అవమానం నుంచి గట్టెక్కించాడు. కాశీని పరిపాలించే మహారాజుకి అంబ, అంబిక, అంబాలిక అని ముగ్గురు కుమార్తెలు. వారిలో అంబ పెద్దది. మహాభారతంలో అందమైన స్త్రీలలో ఒకరైన ఈమెకి ఆమె తండ్రి స్వయంవరాన్ని ఏర్పాటు చేసారు. ఆ సమయంలో మహారాజు భారతదేశంలోని మహారాజులందరికీ ఆహ్వానాలు పంపి హస్తినాపుర మహారాజుకి పంపండం మరిచిపోయాడు. ఇది చూసి ఆగ్రహించిన భీష్ముడు తన మేనళ్ళుడైన విచిత్రవీర్యునికి అంబనిచ్చి పెళ్లి చేయదలచి అంబ, అంబిక, అంబాలిక ముగ్గురినీ అపహరించాడు. కానీ అప్పటికే స్వయంవరంలో తాను సాళ్వ మహారాజుకి మనసిచ్చానని అంబ ధైర్యంగా తన ప్రేమని భీష్ముని ముందు వ్యక్తపరచడం చూస్తే ఆ కాల పరిస్థితులకి ఇది చాలా ధైర్యమైన చర్య అని చెప్పచ్చు.

ఊర్వశి ఇంద్రుని దర్బారులో అందమైన నాట్యగత్తె. అర్జునుని మీద మనసుపడి అతనిని తన అందచందాలతో కవ్వించాలని చూసి భంగపడుతుంది. తనని తిరస్కరించాడని ఆగ్రహించిన ఊర్వశి అర్జునుడు తన మగతనం కోల్పోవాలని శపిస్తుంది. ఆ కాలంలోనే తనకి ఒక పురుషునిపై ఉన్న కామాన్ని ధైర్యం గా వ్యక్తపరిచిన స్త్రీ ఊర్వశి. కుంతి మహాభారతంలో అందగత్తెలైన స్త్రీలలో ఒకరు. ఆమెకి వివాహానికి పూర్వమే సూర్యుని ద్వారా కర్ణుడు జన్మించాడు. కానీ ఈమె ఆటలాడుకుంటూ ఆకతాయితనమంతో సూర్యుడిని పిలిచి కొడుకుని పొందింది. కానీ ఆ తరువాత ఈ చర్య వల్ల తనకి తన కుటుంబానికి అప్రతిష్ఠ కలుగుతుందని భావించి ఆ పిల్లవాడిని ఒక బుట్టలో పెట్టి నదిలో విడిచిపెట్టేసింది. శంతన మహారాజు మొదటి భార్య గంగ. ఈమె అందాన్ని చూసి మోహించిన శంతన మహారాజు తనని మనువాడాల్సిందిగా గంగని కోరతాడు. అయితే ఆమె 3 నిబంధనలతో శంతన మహారాజుని వివాహమాడుతుంది. అందులో మొదటి నిబంధన, తను ఎక్కడనుండి వచ్చింది ఇత్యాది వివరాలేమీ మహారాజు అడగకూడదు. రెండోది, తాను ఏమి చేసిన మహారాజు ఆమె చర్యలని అవి మంచివే అగు గాక లేదా చెడువే అగు గాక, ఆమె చర్యలని మన్నించాలి. ఇక మూడో నిబంధన, పై రెండింటిలో ఏ ఒక్క దానిని మహారాజు అతిక్రమించినా ఆమె మహారాజుని వదిలి వెళ్ళిపోతుంది.

10 powerful women characters in mahabharat

ఉలూపి అందమైన నాగ కన్య. ఈమె అర్జునుని మోహించి అతన్ని వివాహమాడాలనుకుంటుంది. కొన్ని లేపనాల ద్వారా అర్జునుని స్పృహ కోల్పోయేట్లు చేసి అర్జునుని అపహరించి అప్పుడు తన మనసుని అర్జునునికి తెలియచేసింది. బలరామ, శ్రీ కృష్ణుల సోదరి సుభ‌ద్ర‌. ఆమెని చూసి మోహించిన అర్జునుడు ఆమెని వివాహమాడాలనుకుంటాడు. బలరాముడు తన ప్రియ శిష్యుడైన దుర్యోధనునికి సుభద్రని ఇవ్వాలనుకుంటాడు. ఇది ఇష్టంలేని శ్రీ క్రిష్ణుడు ఆమెని అపహరించి తీసుకెళ్లమని అర్జునునికి ఉపదేశిస్తాడు. సత్యవతి శంతన మహారాజు రెండవ భార్య. ఈమె మత్స్యకారుల కుటుంబానికి చెందినది.ఆమె అందానికి, ఆమె నుండీ వెలువడే కస్తూరి పరిమళానికి మహారాజు ఆకర్షితుడయ్యి మనసు పారేసుకుంటాడు.తనకి పుట్టే కుమారులే సిఁహాసనాన్ని అధిరోహించేలా మహారాజునుండి వాగ్దానం తీసుకుని ఈమె మహారాజుని వరించింది.

సుబల మహారాజు కుమార్తె గాంధారి. ఈమె యవ్వనంలో మహాశివుడిని పూజించింది.అందువల్ల శివుడు ఆమెకు నూరుగురు కుమారులు కలిగేలా ఆశీర్వదించాడు.ధృతరాష్టృడిని వివాహమాడిన ఈమె భర్త అంధుడని తెలియగానే తాను కూడా కళ్ళకి గంతలు కట్టుకుని భర్తని అనుసరించింది.తన భర్త కోసమని స్వచ్ఛందంగా కంటి చూపుని జీవితాంతం త్యాగం చేసిన ఈమె మహాభారత అందగత్తెలలో ఒకరు.

Tags: Mahabharat
Previous Post

గాయ‌త్రి మంత్రాన్ని జ‌పించ‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Next Post

పనికిరారు అన్నవారికి బుద్ధి చెప్పి హీరోలుగా మారిన స్టార్లు…!

Related Posts

inspiration

ధాబా ద్వారా రూ.100 కోట్లు సంపాదిస్తున్న సోద‌రులు.. వారి వ్యాపార ర‌హ‌స్యం ఏమిటంటే..?

July 8, 2025
Crime News

భార‌తీయ న‌ర్సుకు యెమెన్‌లో ఉరిశిక్ష‌.. ఇంత‌కీ ఆమె ఏం చేసింది..?

July 8, 2025
పోష‌ణ‌

రోజూ ఈ సూప‌ర్ ఫుడ్స్‌ను తీసుకోండి.. ఎలాంటి స‌మ‌స్య‌లు రావు..!

July 8, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌హిళ‌ల‌కు ఈ అల‌వాటు ఉంటే పిల్ల‌లు పుట్ట‌ర‌ట‌.. తేల్చి చెబుతున్న వైద్యులు..

July 8, 2025
mythology

శ్రీ‌కృష్ణుడి చేతిలో పిల్ల‌న‌గ్రోవి ఎందుకు ఉంటుంది..? దాని అర్థం ఏమిటి..?

July 8, 2025
ఆధ్యాత్మికం

బ్ర‌హ్మ రాసిన త‌ల‌రాత‌ను మార్చుకునే వీలుందా..? పురాణాలు ఏం చెబుతున్నాయి..?

July 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు త‌మ పాదాల పట్ల ఈ జాగ్ర‌త్త‌లను తీసుకోవ‌డం త‌ప్ప‌నిసరి..!

by Admin
July 6, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.