Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ఒకటి రెండు కాదు.. ఏడాదికి 10కి పైగా సినిమాలు విడుదల చేసిన హీరోలు వీళ్లే..!!

Admin by Admin
March 27, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం 100కు పైగానే సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. ఇక డబ్బింగ్ సినిమాలు కలుపుకుంటే వాటి సంఖ్య దాదాపు 150 కి చేరుకుంటుంది. ఇక మన టాలీవుడ్ లో స్టార్ హీరోలు కూడా ఎక్కువే. కానీ వారు ఏడాదికి ఒక్క సినిమా చేయడం గగనంగా మారిపోయింది. ఇక రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులు అయితే రెండు మూడేళ్లకు ఒక సినిమా తీస్తూ ఉంటారు. కానీ గతంలో మన హీరో, హీరోయిన్లు ప్రతి ఏటా పదికి పైగా సినిమాలతో జోరు చూపించేవారు. పోటాపోటీగా బాక్స్ ఆఫీస్ వద్ద వారి సత్తా చూపారు. అలా ఏడాదికి ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

సూపర్ స్టార్ కృష్ణ తన ఐదు దశాబ్దాల సినిమా కెరియర్ లో మొత్తం 350 కి పైగా సినిమాలలో నటించారు. 1970లో ఒకేసారి 16 సినిమాల్లో నటించారు. మరుసటి ఏడాది వాటిలో 11 సినిమాలు విడుదలయ్యాయి. ఇక 1972లో ఏకంగా కృష్ణ హీరోగా నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పటివరకు ఈ రికార్డును ఏ హీరో కూడా బ్రేక్ చేయలేదు. ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు విడుదల చేసిన రికార్డులో రెండవ స్థానం నందమూరి తారకరామారావుది. 1964 లో ఈయన నటించిన 17 సినిమాలు విడుదలయ్యాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి హీరోలతో పోటీపడి ఏడాదికి పదికి పైగా సినిమాలు చేసి రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. 1974లో 17 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కృష్ణంరాజు.

these actors released over 10 movies in a year

హీరోలు కూడా నవ్వించగలరని చూపించి కథానాయకుడి పాత్రకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన నటుడు రాజేంద్రప్రసాద్. ఈయన ఇప్పటివరకు 300కు పైగా చిత్రాలలో నటించారు. 1988లో మొత్తం 17 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. 1980లో ఏకంగా 14 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫ్యామిలీ హీరో జగపతి బాబు ఇప్పుడు విలన్ గా పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. జగపతిబాబు కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఒక సంవత్సరంలోనే ఆరు సినిమాలను విడుదల చేశారు. నందమూరి నటసింహం బాలకృష్ణ 1987వ సంవత్సరంలో ఏకంగా ఏడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

Tags: krishna
Previous Post

మోడరన్ టాయిలెట్ లో రెండు ఫ్లష్ బటన్స్ ఉంటాయి.. మీరెప్పుడైనా గమనించారా..? ఎందుకో తెలుసా..?

Next Post

భారతీయ రైల్వేలో ఎరుపు, నీలం మరియు ఆకుపచ్చ కోచ్ లు ఎందుకు ఉన్నాయో మీకు తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025
వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025
lifestyle

రాత్రి 3 గంటల సమయంలో నిజంగానే దెయ్యాలు తిరుగుతాయా? ఆ స‌మ‌యాన్ని డెవిల్స్ అవర్ అని ఎందుకు అంటారు.?

June 14, 2025
Off Beat

చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!