పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును త‌గ్గించే వ్యాయామం.. చేయ‌డం సుల‌భ‌మే..!

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకునేందుకు అనేక ర‌కాల వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఒక‌టి ప్లాంక్ (Plank) ఎక్స‌ర్‌సైజ్‌. చూసేందుకు ఈ వ్యాయామం తేలిగ్గానే అనిపిస్తుంది. కానీ ఈ వ్యాయామం చేయ‌డం కొద్దిగా క‌ష్ట‌మే. అయితే దీన్ని నిత్యం కొంత‌సేపు చేసినా చాలు. అద్భుతమైన ఫ‌లితాలు వ‌స్తాయి.

ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ ఇలా చేయాలి

చిత్రంలో చూపిన‌ట్లుగా బోర్లా ప‌డుకుని మోచేతులను, పాదాల మునివేళ్ల‌ను నేల‌పై ఆనించి ఆయా భాగాల స‌పోర్ట్‌తో పైకి లేవాలి. ఈ భంగిమ‌లో కొంత సేపు ఉండాలి. దీన్నే ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ అంటారు. 30 రోజుల పాటు ఈ వ్యాయామాన్ని కింద తెలిపిన విధంగా చేస్తే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

30 రోజుల ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ చాలెంజ్

  • 1వ రోజు – 20 సెక‌న్లు
  • 2వ రోజు – 20 సెక‌న్లు
  • 3వ రోజు – 30 సెక‌న్లు
  • 4వ రోజు – 30 సెక‌న్లు
  • 5వ రోజు – 40 సెక‌న్లు
  • 6వ రోజు – విశ్రాంతి
  • 7వ రోజు – 45 సెక‌న్లు
  • 8వ రోజు – 45 సెక‌న్లు
  • 9వ రోజు – 60 సెక‌న్లు
  • 10వ రోజు – 60 సెక‌న్లు
  • 11వ రోజు – 60 సెక‌న్లు
  • 12వ రోజు – 1 నిమిషం 30 సెక‌న్లు
  • 13వ రోజు – విశ్రాంతి
  • 14వ రోజు – 1 నిమిషం 40 సెక‌న్లు
  • 15వ రోజు – 1 నిమిషం 50 సెక‌న్లు
  • 16వ రోజు – 2 నిమిషాలు
  • 17వ రోజు – 2 నిమిషాలు
  • 18వ రోజు – 2 నిమిషాల 30 సెక‌న్లు
  • 19వ రోజు – విశ్రాంతి
  • 20వ రోజు – 2 నిమిషాల 30 సెక‌న్లు
  • 21వ రోజు – 2 నిమిషాల 30 సెక‌న్లు
  • 22వ రోజు – 3 నిమిషాలు
  • 23వ రోజు – 3 నిమిషాలు
  • 24వ రోజు – 3 నిమిషాల 30 సెక‌న్లు
  • 25వ రోజు – 3 నిమిషాల 30 సెక‌న్లు
  • 26వ రోజు – విశ్రాంతి
  • 27వ రోజు – 4 నిమిషాలు
  • 28వ రోజు – 4 నిమిషాలు
  • 29వ రోజు – 4 నిమిషాల 30 సెక‌న్లు
  • 30వ రోజు – 5 నిమిషాలు

ఇలా మొద‌టి రోజు ఈ వ్యాయామాన్ని 20 సెక‌న్ల‌తో మొద‌లు పెట్టి త‌రువాత రోజూ నెమ్మ‌దిగా స‌మ‌యం పెంచుకుంటూ పోవాలి. 30 రోజుల త‌రువాత కూడా మీరు ఈ వ్యాయామాన్ని చేయ‌వ‌చ్చు. కాక‌పోతే అప్ప‌టికీ మీకు అల‌వాటు అవుతుంది క‌నుక మీకు న‌చ్చినంత స‌మ‌యం పాటు ఈ వ్యాయామం చేయ‌వ‌చ్చు. మీకు అనువుగా ఉండేంత వ‌ర‌కు ప్లాంక్ భంగిమ‌లో కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండ‌వ‌చ్చు. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ వ్యాయామాన్ని చేస్తూ రోజూ స‌మయాన్ని మీకు అనుగుణంగా కొద్ది కొద్దిగా పెంచుతూ పోవాలి. దీంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ ఉప‌యోగాలు

  • ఈ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌ర కండ‌రాలు, ఛాతి భాగం దృఢంగా మారుతాయి.
  • శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. అధిక బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రుగుతుంది.
  • నిత్యం కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుని ప‌ని చేసేవారికి శ‌రీర భంగిమ స‌రిగ్గా ఉండ‌దు. ఈ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల చ‌క్క‌ని భంగిమ ఏర్ప‌డుతుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.
  • శారీర‌క సామ‌ర్థ్యం పెరుగుతుంది. కండ‌రాలు దృఢంగా మారుతాయి.

సూచ‌న‌: ఈ వ్యాయామం చేసేట‌ప్పుడు స‌రైన భంగిమ‌లో ఉండాలి. లేదంటే ఇబ్బందులు వ‌స్తాయి. ఇక మ‌రీ అధికంగా బ‌రువు ఉన్న‌వారు, గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్‌ల స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ముందుగా డాక్ట‌ర్‌ను క‌లిసి ఈ వ్యాయామం చేయాలా వ‌ద్దా అని స‌ల‌హా తీసుకోవ‌డం మంచిది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts