అధిక బరువు, పొట్ట దగ్గరి కొవ్వు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అధిక బరువు తగ్గడం లేదని, పొట్ట అలాగే ఉంటుందని బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు కింద చెప్పిన విధంగా 30 రోజుల పాటు డైట్‌ను పాటిస్తే దాంతో ఎంతటి సాగిన బాన పొట్ట అయినా ఫ్లాట్‌గా మారుతుంది. మరి ఆ డైట్ ఏమిటంటే..
1. రోజూ ఉదయం నిద్ర లేవగానే పరగడుపునే కనీసం 1 నుంచి 1.5 లీటర్ల నీటిని తాగాలి. అన్ని నీళ్లను ఒకేసారి తాగలేకపోతే కొద్ది కొద్దిగా తాగుతూ అలవాటు చేసుకోవాలి. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. విరేచనం సాఫీగా అవుతుంది. జీర్ణాశయం ఖాళీ అవుతుంది.
2. ఉదయం 1 గంటసేపు పొట్ట తగ్గే వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా సూర్య నమస్కారాలను ప్రాక్టీస్ చేయాలి. రోజుకు కనీసం 101 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి. ఆరంభంలో కష్టం కనుక 10 సార్లతో మొదలు పెట్టాలి. క్రమంగా దాన్ని పెంచుతూ పోవాలి.
3. వ్యాయామంలో భాగంగా ఉత్థానపాదాసనం, నౌకాసనం లను ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు వేయాలి. వీటితో పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది.
4. ఉదయం 9 గంటలకు ఏదైనా పండ్ల రసం లేదా కూరగాయల జ్యూస్ తాగాలి. 9 గంటలకు ఆ జ్యూస్‌ను తాగాలి. ఇదే బ్రేక్‌ఫాస్ట్‌లా భావించాలి.
5. తరువాత 11-12 గంటల మధ్య లంచ్ చేయాలి. అందులో 3, 4 రకాల మొలకలను తినాలి. కిస్మిస్‌లు 10, దానిమ్మ పండు గింజలు, బొప్పాయి పండు లేదా మీకు సౌకర్యంగా ఉండే ఏదైనా పండ్లను తినాలి.
6. తరువాత సాయంత్రం 4.30 గంటల వరకు ఏమీ తినరాదు. నీళ్లను తాగుతూ ఉండాలి. 4.30 గంటలకు ఏదైనా పండ్ల జ్యూస్, కొబ్బరినీళ్లు, చెరకు రసం వంటివి తాగాలి.
7. తరువాత 6 గంటలకు డిన్నర్ చేసేయాలి. అందులో బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్ ను 10-15 చొప్పున తినాలి. అన్నింటినీ ఉదయం నీటిలో విడి విడిగా నానబెట్టాలి. సాయంత్రం డిన్నర్‌లో తినాలి. అలాగే ఎండు ఖూర్జూరాలు 8, బొప్పాయి, తర్బూజా, పుచ్చకాయ, జామ పండు, అరటి పండు వంటి పండ్లను తినాలి. ఈ ఆహారాలను కడుపు నిండా తిన్నా బొజ్జ రాదు. పైగా పొట్ట తగ్గుతుంది. కొవ్వు కరుగుతుంది.
ఈ డైట్‌ను పాటించే వారిలో ఆరంభంలో 7-10 రోజుల పాటు శరీరంలో సోడియం, పొటాషియం తగ్గుతాయి. కనుక రోజూ కొబ్బరినీళ్లను తాగాలి. లేదా ఎలక్ట్రోలైట్ పొడిని కొని తెచ్చి తాగాలి. 10 రోజుల తరువాత శరీరం ఈ డైట్‌కు అలవాటు పడుతుంది. కనుక ఎలక్ట్రోలైట్‌లను తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక ఈ డైట్‌ను 30 రోజుల పాటు పాటించి చూడాలి. దీంతో తప్పక మార్పు కనిపిస్తుంది. ఎంతటి బాన పొట్ట అయినా ఫ్లాట్ గా మారుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్), ట్రై గ్లిజరైడ్స్ తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. చక్కగా నిద్ర పడుతుంది.
ఈ డైట్‌ను పాటించడం వల్ల మైండ్ యాక్టివ్ గా మారుతుంది. బద్దకం పోతుంది. అన్ని పోషకాలు సరిగ్గా అందుతాయి కనుక ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ డైట్‌ను 30 రోజుల పాటు ఒక నియమంలా పాటించాలి. తరువాత ఫలితాలను బట్టి 60 రోజులు, 90 రోజుల పాటు కూడా ఈ డైట్‌ను పాటించవచ్చు. దీన్ని డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు సూచిస్తున్నారు.