అధిక బరువు తగ్గడం అనేది చాలా మందికి ఇబ్బందిగా మారింది. బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. నిత్యం ఒత్తిడిని తీవ్రంగా ఎదుర్కొంటుండడం, శారీరక శ్రమ ఏమాత్రం చేయకపోవడం, కూర్చుని గంటల తరబడి పనిచేయడం.. వంటి అనేక కారణాల వల్ల అధికంగా బరువు పెరుగుతున్నారు. అయితే కింద తెలిపిన టిప్స్‌ను పాటిస్తే అధిక బరువును కేవలం 7 రోజుల్లోనే వేగంగా తగ్గించుకోవచ్చు. లేదా బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. మరి అందుకు పాటించాల్సిన ఆ టిప్స్ ఏమిటంటే..
1. మనకు అందుబాటులో ఉన్న అనేక కూరగాయల్లో కీరదోస ఒకటి. దీంట్లో నీరు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే బరువు తగ్గించుకోవచ్చు. మూడు పూటలా భోజనం చేసే ముందు కప్పు కీరదోస ముక్కలను తినాలి. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. పైగా ఆహారం తక్కువగా తింటారు. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
2. నిత్యం తగినంత నీటిని తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా బరువు తగ్గుతారు. అందువల్ల రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని తాగే ప్రయత్నం చేయాలి.
3. రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే వాకింగ్ చేయాలి. దీంతో మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గేందుకు వాకింగ్ సహాయ పడుతుంది.
4. రోజూ కనీసం 7 గంటల పాటు అయినా సరే నిద్రించాలి. దీని వల్ల మెటబాలిజం సరిగ్గా ఉంటుంది. బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
5. రోజూ మీరు తినే ఆహార పదార్థాల్లో అల్లం, పసుపును భాగం చేసుకోవాలి. అల్లం ముక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగడం లేదా అల్లం రసాన్ని భోజనానికి ముందు ఒక టీస్పూన్ మోతాదులో రోజుకు రెండు సార్లు తీసుకోవడం లేదా రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగడం.. వంటివి చేస్తే అధిక బరువు తగ్గుతారు.
6. రోజూ వ్యాయామం చేస్తున్నామని, పౌష్టికాహారం తీసుకుంటున్నామని చెప్పి చాలా మంది శీతలపానీయాలను తాగుతుంటారు. కానీ అలా చేయరాదు. వాటిని తాగితే బరువు తగ్గేందుకు మీరు పడే శ్రమ అంతా వృథా అవుతుంది. కనుక వాటికి బదులుగా హెర్బల్ టీ లను తాగాలి. దీంతో బరువు తగ్గే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. బరువు నియంత్రణలోకి వస్తుంది.
7. రోజుకు కనీసం రెండు కప్పుల గ్రీన్ టీని తాగితే నెలకు కనీసం ఒక కిలో బరువు అయినా తగ్గుతారు. సైంటిస్టుల అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. కనుక రోజూ ఉదయం, సాయంత్రం ఒక కప్పు చొప్పున గ్రీన్ టీని తాగాలి. దీని వల్ల బరువు వేగంగా తగ్గుతారు.
8. రోజూ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. వాటిని ఉడకబెట్టి ఆహారంలో ముందుగా తినాలి. ఇక పండ్లను అయితే స్నాక్స్ సమయంలో తినాలి. దీని వల్ల బరువు వేగంగా తగ్గుతారు.
9. రోజూ కనీసం 15 నిమిషాల పాటు అయినా సరే స్కిప్పింగ్ చేయాలి. దీని వల్ల శారీరక శ్రమ బాగా జరుగుతుంది. దీంతో అధిక బరువు వేగంగా తగ్గుతారు.