Meals : ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల ఆహారానికి ఎంతటి డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. భారత దేశంలో భిన్న రాష్ట్రాల్లో భిన్న రకాల భోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఉత్తరాది వారు చపాతీలను ఎక్కువగా తింటుంటారు. దక్షిణాది వారు అన్నానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అయితే కొన్ని రకాల భోజనాల్లో చపాతీలు, రైస్‌తోపాటు పలు భిన్న రకాల వంటకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా రెస్టారెంట్ల వారు ఇలాంటి భోజనాలను తమ కస్టమర్లకు అందిస్తుంటారు.
ఇక ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లోనూ రైస్, చపాతీలు లాంటి భిన్న రకాల ఆహారాలతో ఒక ప్రత్యేకమైన భోజనాన్ని అందిస్తున్నారు. దాన్ని తిన్నవారు ఏకంగా రూ.8.50 లక్షలను సొంతం చేసుకోవచ్చు. అవును.. ఇది నిజమే.
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ మార్కెట్‌లో ఉన్న ఆర్డర్ 2.1 అనే రెస్టారెంట్‌లో ఐరన్ మ్యాన్ థాలి పేరిట ఓ ప్రత్యేకమైన భోజనాన్ని అందిస్తున్నారు. అందులో అనేక రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. రైస్, చపాతీ ఐటమ్స్‌తోపాటు టిక్కా, కబాబ్స్, ఫ్రై ఐటమ్స్, బిర్యానీలు, ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్స్.. వంటి అనేక రకాల ఆహారాలను ఒకే భోజనంలో అందిస్తున్నారు.
అయితే ఈ భోజనానికి ఐరన్ మ్యాన్ థాలి అని పేరు పెట్టగా దాన్ని కేవలం ఇద్దరే తినాల్సి ఉంటుంది. అది కూడా 30 నిమిషాల్లో అన్ని ఐటమ్స్‌ను తినేయాలి. అలా తిన్నవారికి రూ.8.50 లక్షలను ఆ రెస్టారెంట్ వారు ఇస్తారు. ఇది ఓ సరికొత్త చాలెంజ్‌గా మారింది. నెటిజన్లు ఆ మీల్స్ ను చూసి తాము కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించాలని చూస్తున్నారు. మరింకెందుకాలస్యం.. మీరు కూడా భోజన ప్రియులు అయితే.. ఆ చాలెంజ్‌ను పూర్తి చేయగలమని భావిస్తే.. వెంటనే ఆ మీల్స్‌ను తినేయండి.. రూ.8.50 లక్షలను గెలుచుకోవచ్చు.