పాలలో కాల్షియం అనే పోషక పదార్థం సమృద్ధిగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. దీని వల్ల మన శరీరంలో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. పాలలో ఉండే ప్రోటీన్ కండరాల నిర్మాణానికి దోహదపడుతుంది. అలాగే వీటిలో ఉండే విటమిన్ ఎ, బి, డిలు కాల్షియం, ఇతర పోషకాలను శరీరం శోషించుకునేలా చేస్తాయి. అయితే పాలను నిత్యం తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలిగినప్పటికీ కొందరు మనకు పాలు మంచివి కావని భావిస్తుంటారు. వాటిని తాగడం వల్ల బరువు పెరుగుతామని, అవి త్వరగా జీర్ణం కావని, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని.. కొందరు సందేహిస్తుంటారు. అయితే ఆ సందేహాలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అవి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అవి నిజంగా చక్కని ఆహారం. పాలను పోషకాల గనిగా చెప్పవచ్చు. ఒక గ్లాసు పాలలో 8 గ్రాముల ప్రోటీన్, 300 మిల్లీగ్రాముల కాల్షియం, పొటాషియం, విటమిన్ డి, ఇతర పోషకాలు ఉంటాయి.
వెన్న తీయని పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కనుక ఆ పాలను తాగితే బరువు పెరుగుతారు. అదే వెన్న తీసిన పాలు అయితే వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కనుక బరువు తగ్గుతారు. కనుక బరువు తగ్గాలనుకునే వారు వెన్న తీసిన పాలు తాగాలి. ఇక నిత్యం ఉదయాన్నే లేదా మధ్యాహ్నం పూట పాలను తాగితే మంచిది.
పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే పాలను నిత్యం అందరూ తాగవచ్చు. మన శరీరానికి అవసరమయ్యే కీలక పోషకాలను పాలు అందిస్తాయి. అయితే చిన్నారులకు ఆవు పాలు తాగించాలి. యుక్త వయస్సులో ఉండేవారు టోన్డ్ మిల్క్ తాగాలి. అదే పెద్దలు అయితే స్కిమ్మ్‌డ్ మిల్క్ తాగాలి.
పాలు, చేపలను ఒకేసారి తీసుకోవడం వల్ల చర్మంపై తెల్లని మచ్చలు వస్తాయని ఎంతో మంది ఇప్పటికీ నమ్ముతారు. కానీ అందులో నిజం లేదు. అయినప్పటికీ ఆయుర్వేదం ప్రకారం ఆ రెండింటినీ ఒకేసారి తీసుకోరాదు. ఎందుకంటే.. చేపలు అసిడిక్ స్వభావాన్ని, పాలు ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ క్రమంలో రెండింటినీ కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. కనుక రెండింటినీ కలిపి తీసుకోకపోవడమే ఉత్తమం.
అవును, పాలు త్వరగా జీర్ణం కావు. కానీ ఇది అందరికీ ఒకేలా ఉండదు. పాలలో ఉండే లాక్టోస్ అనే పదార్థం వల్ల కొందరికి పాలు జీర్ణం కావు. దీంతో గ్యాస్, అసిడిటీ వస్తాయి. దీన్నే లాక్టోస్ ఇన్‌టోలరెంట్ అని పిలుస్తారు. ఈ సమస్య కేవలం కొందరికి మాత్రమే వస్తుంది. పాలు జీర్ణం అయ్యే వారు వాటిని నిర్భయంగా తాగవచ్చు. పాలను తాగాక ఆయా సమస్యలు వస్తే.. వాటిని తాగకూడదు. ఇక అలాంటప్పుడు కాల్షియం లభించడం కోసం పెరుగు, చీజ్, బాదంపప్పు, విత్తనాలు, చేపలు, బీన్స్, పప్పులు.. తదితర పదార్థాలను తినవచ్చు.
అవును, ఉంటాయి. నట్ మిల్క్, ఓట్ మిల్క్, రైస్ మిల్క్, సోయా మిల్క్.. ఇలా భిన్నరకాల పాలు లభిస్తాయి. వీటిని కూడా మనం తాగవచ్చు. ఆయా పాల వెరైటీని బట్టి మనకు పోషకాలు లభిస్తాయి.