ఒక వ్యక్తికి కరోనా వచ్చిందా, రాలేదా ? అని గుర్తించేందుకు ఆ వ్యక్తికి ఉండే లక్షణాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఆ లక్షణాలను త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే రోగికి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడకుండా ఉంటాయి. అయితే కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే కోవిడ్ వస్తుంది. కొందరికి రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే కోవిడ్ వచ్చిన వారికి ఇవే కాకుండా నోటి పరంగా ఇంకా పలు లక్షణాలు కూడా కనిపిస్తాయి. అవేమిటంటే…
1. కోవిడ్ ఉన్నవారిలో నోరు పొడిబారుతుంది. సాధారణంగా మన నోట్లో చేరే బాక్టీరియా, ఇతర సూక్ష్మ క్రిములను నాశనం చేసేందుకు ఉమ్మి ఉత్పత్తి అవుతుంది. కానీ కోవిడ్ వస్తే ఉమ్మి ఉత్పత్తి కాదు. దీంతో నోరు అంతా ఎండిపోయినట్లు పొడిగా మారుతుంది. ఈ లక్షణం ఉంటే కోవిడ్ ఉందేమోనని అనుమానించాలి.
2. నోట్లో పొక్కులు, గుల్లలు సహజంగానే కొందరికి పోషకాహార లోపం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల వస్తుంటాయి. కానీ కోవిడ్ ఉన్న వారిలోనూ ఇవి కనిపిస్తాయి.
3. కోవిడ్ సోకిన వారికి నాలుక మంట మండినట్లు అనిపిస్తుంది. నాలుకపై దద్దుర్లు కూడా వస్తాయి.
4. కోవిడ్ ఉంటే నాలుక రంగు మారుతుంది. నోరంతా దురద ఉన్నట్లు అనిపిస్తుంది. పెదవులు వాపులకు గురవుతాయి. ఆహార పదార్థాలను తినడం, పానీయాలను మింగడం కష్టమవుతుంది.
ఈ లక్షణాలు గనక ఎవరికైనా ఉంటే కోవిడ్ ఉందేమోనని అనుమానించాలి. వెంటనే కోవిడ్ టెస్టు చేయించుకోవాలి. అందులో పాజిటివ్ అని నిర్దారణ అయితే వెంటనే చికిత్స తీసుకోవాలి. ఈ లక్షణాలను అశ్రద్ధ చేస్తే కోవిడ్ తీవ్రత ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365