Aloo Bonda : ఆలు బొండాల‌ను ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటాయి..

Aloo Bonda : మ‌న‌కు సాయంత్రం పూట రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద, హోట‌ల్స్ లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ఆలూ బోండా కూడా ఒకటి. పైన క‌ర‌క‌ర‌లాడుతూ లోప‌ల మెత్త‌గా ఉండే ఈ ఆలూ బోండాను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఆలూ బోండాను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. మొద‌టిసారి చేసే వారు కూడా సుల‌భంగా త‌యారు చేసుకునేలా, తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఈ ఆలూ బోండాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ బోండా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – 3 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌చ్చిమిర్చి త‌రుగు – ఒక టీ స్పూన్, అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, చిన్న‌గా తరిగిన ఉల్లిపాయ – 1, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, బియ్యంపిండి – 2 టీ స్పూన్స్, ప‌సుపు – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌, వాము – పావు టీ స్పూన్, వంట‌సోడా – పావు టీ స్పూన్, నీళ్లు – త‌గిన‌న్ని.

Aloo Bonda recipe in telugu this is the way to make them
Aloo Bonda

ఆలూ బోండా త‌యారీ విధానం..

ముందుగా ఉడికించిన బంగాళాదుంప‌లను మెత్త‌గా చేసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, అల్లం త‌రుగు, ఉల్లిపాయ ముక్కలు, ప‌సుపు వేసి వేయించాలి. త‌రువాత కారం, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత మెత్త‌గా చేసుకున్న బంగాళాదుంప‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండి, బియ్యం పిండి, ప‌సుపు, ఉప్పు, వాము, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ చిక్క‌గా బ‌జ్జీ పిండిలా క‌లుపుకోవాలి.

త‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న బంగాళాదుంప మిశ్ర‌మాన్ని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూను పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బంగాళాదుంప ఉండ‌ల‌ను శ‌న‌గ‌పిండి మిశ్ర‌మంలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బోండా త‌యార‌వుతుంది. దీనిని ట‌మాట కిచ‌ప్, ప‌ల్లీ చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం పూట స్నాక్స్ గా త‌యారు చేసుకుని తిన‌డానికి ఈ ఆలూ బోండా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని ఇంట్లో అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts