Aloo Cauliflower Masala Curry : ఆలు, కాలిఫ్ల‌వ‌ర్‌.. రెండింటినీ క‌లిపి ఇలా మ‌సాలా కూర చేయండి.. ఎంతో బాగుంటుంది..

Aloo Cauliflower Masala Curry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. కేవ‌లం బంగాళాదుంప‌ల‌నే కాకుండా వాటితో ఇత‌ర కూర‌గాయ‌ల‌ను కూడా క‌లిపి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇలా బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన కూర‌ల్లో ఆలూ కాలీప్ల‌వ‌ర్ మ‌సాలా కూర కూడా ఒక‌టి. ఈ కూర పొడి పొడిగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే ఆలూ కాలీప్ల‌వ‌ర్ మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ కాలీప్ల‌వ‌ర్ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పొడుగ్గా త‌రిగిన బంగాళాదుంప‌లు – 3, త‌రిగిన కాలీప్ల‌వ‌ర్ – 1 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ట‌మాట – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మసాలా – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన ట‌మాట – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Cauliflower Masala Curry recipe in telugu make in this method
Aloo Cauliflower Masala Curry

ఆలూ కాలీప్ల‌వ‌ర్ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా కాలీప్ల‌వ‌ర్ ను వేడి నీటిలో వేసి 3 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత వ‌డ‌క‌ట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి మ‌ధ్య‌స్థ మంట‌పై 90 వ‌ర‌కు వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని అదే క‌ళాయిలో కాలీప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే నూనెలో జీల‌కర్ర వేసి వేయించాలి. జీల‌క‌ర్ర వేగిన త‌రువాత ట‌మాట‌ను పేస్ట్ గా చేసుకుని వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం, క‌సూరి మెంతి, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి.

త‌రువాత ప‌చ్చిమిర్చి ముక్క‌లు, ట‌మాట ముక్కలు వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వేయించిన కాలీప్ల‌వ‌ర్, క్యాప్సికం వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో 2 టేబుల్ స్పూన‌ల్ నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ కాలీప్ల‌వ‌ర్ మసాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా బంగాళాదుంప‌ల‌ను, కాలీప్ల‌వ‌ర్ ను క‌లిపి చేసిన కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts