Aloo Fry : ఆలు ఫ్రైని ఇలా ఎప్పుడైనా చేశారా.. అన్నం, రోటీల్లోకి ఎంతో సూప‌ర్‌గా ఉంటుంది..!

Aloo Fry : బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ ఫ్రై కూడా ఒక‌టి. ఆలూ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఆలూ ఫ్రైను ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ద‌తిలో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే ఆలూ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. అన్నంతో తిన‌డానికి, సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిరియాలు – పావు టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ఎండుమిర్చి – 6, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు – 8, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన ఉల్లిపాయ – 1, ఉడికించి బంగాళాదుంప‌లు – పెద్ద‌వి మూడు, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు.

Aloo Fry recipe very tasty with rice and roti
Aloo Fry

ఆలూ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత మిరియాలు, దాల్చిన చెక్క‌, ఎండుమిర్చి, ధ‌నియాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత బంగాళాదుంప‌ల‌ను ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు, క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. వీటిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌రో 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ఆలూ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts