Aratikaya Pachadi : పాత ప‌ద్ధ‌తిలో అర‌టికాయ ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Aratikaya Pachadi : మ‌నం అర‌టికాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌చ్చి అర‌టికాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కూడా పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ప‌చ్చి అర‌టికాయ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా చిప్స్, ఫ్రై, కూర వంటి వాటినే త‌యారు చేస్తూ ఉంటాము. కానీ ప‌చ్చి అర‌టికాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అన్నంతో తింటే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. క‌మ్మ‌గా, చూస్తేనే నోట్లో నీళ్లు ఊరేలా ఉండే ఈ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అర‌టికాయ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అర‌టికాయ‌లు – 2, ప‌చ్చిమిర్చి – 8 లేదా త‌గిన‌న్ని, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, ఆవాలు – అర టీ స్పూన్, ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aratikaya Pachadi recipe in telugu make in this method
Aratikaya Pachadi

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఎండుమిర్చి – 2.

అర‌టికాయ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా అర‌టి కాయ‌ల‌కు గాట్లు పెట్టుకుని మంట‌పై కాల్చుకోవాలి. అర‌టికాయ‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ప‌చ్చిమిర్చిని, వెల్లుల్లి రెబ్బ‌లను కూడా అలాగే కాల్చుకోవాలి. త‌రువాత అర‌టికాయ‌ల‌పై ఉండే పొట్టును తీసేసి ప‌క్కకు ఉంచాలి. అలాగే ప‌చ్చిమిర్చి తొడిమ‌ల‌ను, వెల్లుల్లి రెబ్బ‌ల‌పై ఉండే పొట్టును తీసేసి ప‌క్కకు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో ఆవాలు, మెంతులు, జీల‌క‌ర్ర‌, ధ‌నియాలు వేసి వేయించాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి.

ఇదే జార్ లో ఉప్పు, ప‌సుపు, చింత‌పండును వేసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత అర‌టికాయ‌ల‌ను వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉల్లిపాయ ముక్క‌లు, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. ఈ ప‌చ్చ‌డిని నేరుగా ఇలాగే తిన‌వ‌చ్చు. లేదంటే తాళింపు వేసుకుని కూడా తిన‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌చ్చి అర‌టికాయ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts