Yeriyeppa Dosa : కర్ణాటక స్పెషల్ ఎరియప్ప దోశ గురించి తెలుసా.. రుచి చాలా బాగుంటుంది.. త‌యారీ ఇలా..

Yeriyeppa Dosa : మ‌న దేశంలో అనేక రాష్ట్రాల వారు త‌మ అభిరుచులకు అనుగుణంగా వివిధ ర‌కాల అల్పాహారాల‌ను తింటుంటారు. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను త‌మ ప‌ద్ధ‌తుల‌కు అనుగుణంగా త‌యారు చేసుకుని తింటారు. అయితే అలాంటి సంప్ర‌దాయ వంట‌కాల్లో ఎరియ‌ప్ప దోశ ఒక‌టి. ఇది క‌ర్ణాట‌క‌లో బాగా స్పెష‌ల్‌. రుచి అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

karnataka special Yeriyeppa Dosa here it is how to make it
Yeriyeppa Dosa

ఎరియప్ప దోశ త‌యారీకి కావలసిన పదార్థాలు

రాత్రంతా నాన పెట్టిన బియ్యం – అర కప్పు, నీరు – 1 కప్పు, బెల్లం – 1 కప్పు, తురిమిన కొబ్బరి – 1 కప్పు, నెయ్యి – అర కప్పు, యాలకుల పొడి – ముప్పావు టీ స్పూన్.

ఎరియప్ప దోశను త‌యారు చేసే విధానం..

మిక్సీలో నానబెట్టిన బియ్యం, కొబ్బరి వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. దీనిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి బెల్లం వేసి తగినన్ని నీళ్ళు చేర్చి పాకం పట్టాలి. ఈ బెల్లం పాకాన్ని బియ్యం, కొబ్బరి మిశ్రమంలో కలపాలి. యాలకుల పొడి చేర్చి దోశ పిండిలాగా బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే పాన్ పెట్టి నెయ్యి రాసి దోశల్లాగా వేయాలి. ఇది గోధుమ రంగులో వచ్చే వరకు రెండు వైపులా వేయించాలి. వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా వడ్డించుకోవాలి. అంతే కర్ణాటక స్పెషల్ ఎరియప్ప దోశ రెడీ అవుతుంది. దీన్ని ఏదైనా చ‌ట్నీతో తింటే రుచి అద్బుతంగా ఉంటుంది. లేదా నేరుగా కూడా తిన‌వ‌చ్చు. అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు.

Share
Editor

Recent Posts