Mulakkada Sambar : మున‌క్కాడ‌ల సాంబార్ ఇలా చేయండి చాలు.. రుచి అదిరిపోతుంది..!

Mulakkada Sambar : సాంబార్ అంటే మ‌నకు హోట‌ల్స్ లో లేదా ఫంక్ష‌న్ల‌లో చేసే సాంబార్ గుర్తుకు వ‌స్తుంది. ఎందుకంటే ఆయా సంద‌ర్భాల్లో చేసే సాంబార్ ఎంతో రుచిగా ఉంటుంది. సాధార‌ణం క‌న్నా ఒక ముద్ద అన్నం ఎక్కువ‌గానే తింటారు. అయితే అలాంటి రుచి వ‌చ్చేలా మ‌నం ఇంట్లోనూ సాంబార్‌ను చేయ‌వ‌చ్చు. అందులో మున‌క్కాడలు వేసి చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మున‌క్కాడ‌ల సాంబార్ త‌యారీకి కావలసిన పదార్థాలు..

కందిపప్పు – ఒక కప్పు, మునక్కాడలు – 2, ఉల్లిపాయ – ఒకటి, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, చింతపండు – చిన్న ఉల్లిపాయ సైజు, మెంతులు – అర టేబుల్ స్పూన్, పసుపు – చిటికెడు, ఆవాలు, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, నూనె – తగినంత, కరివేపాకు – రెమ్మ, నీళ్లు – లీటర్.

Mulakkada Sambar recipe in telugu make in this way
Mulakkada Sambar

మున‌క్కాడ‌ల సాంబార్ తయారీ విధానం..

ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి నీటిని పోసి ఆ నీటిని బాగా మరిగించాలి. నీరు మరుగుతుండగా ఆ సమయంలో కందిపప్పును కడిగి అందులో వేసుకోవాలి. కందిపప్పు 70 శాతం ఉడికిన తరువాత అందులో ముందుగా తరిగి పెట్టుకున్న మనగ కాయలను వేయాలి. మునగ కాయలను 2 నిముషాలు ఉడికించిన తరువాత చిటికెడు పసుపు, ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలను, మునగ కాయలను ఉడికించాలి. ఈలోగా మరొక స్టవ్ పై కడాయి ఉంచి మెంతుల‌ను దోరగా వేయించుకోవాలి.

అలాగే చింతపండును కూడా నానబెట్టుకోవాలి. మునగకాడలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులో టేబుల్ స్పూన్ కారం వేయాలి. మరో ఐదు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ఉడికించిన తరువాత చింతపండు బాగా నలిపి చింత పులుసు వేయాలి. చింతపులుసు వేసిన రెండు నిమిషాలకు తగినంత ఉప్పును వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. చివరిగా దోరగా వేయించుకొని మెంతులను పొడిచేసి మెంతుల పొడి సాంబారులో వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు పెట్టుకుంటే ఎంతో రుచికరమైన మునక్కాడల సాంబార్ తయారైనట్లే. దీన్ని అన్నంలో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Share
Editor

Recent Posts