Munakkaya Chicken : మున‌క్కాయ‌లు, చికెన్ క‌లిపి ఇలా వండండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Munakkaya Chicken : మున‌క్కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అయితే త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు మున‌క్కాయ‌ల‌తో మ‌నం మున‌క్కాయ చికెన్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మున‌క్కాయ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. వెరైటీ రుచుల‌ను కోరుకునే వారు దీనిని త‌ప్ప‌కుండా ఒక‌సారి ట్రే చేయాల్సిందే. ఎంతో రుచిగా ఉండే ఈ మున‌క్కాయ చికెన్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మున‌క్కాయ చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర‌కిలో, త‌రిగిన మున‌క్కాయ‌లు – 3, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, నూనె – 3టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 3, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ట‌మాట – 1, నీళ్లు – ఒక‌టిన్న‌ర గ్లాస్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Munakkaya Chicken recipe in telugu make in this method
Munakkaya Chicken

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 3, వెల్లుల్లి రెమ్మ‌లు – 10, అల్లం – ఒక ఇంచు ముక్క‌, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన టమాట – 1, జీడిప‌ప్పు – 20.

మున‌క్కాయ చికెన్ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో చికెన్, మున‌క్కాయ ముక్క‌లు, ఒక టీ స్పూన్ ఉప్పు, కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి చికెన్ లోని నీరంతా పోయే వ‌ర‌కు వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి.

వీటిని కూడా మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని ఊనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన చికెన్ వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. చికెన్ మెత్త‌గా ఉడికి కొద్దిగా ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత గ‌రం మసాలా వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మున‌క్కాయ చికెన్ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన మున‌క్కాయ చికెన్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts