Omelette Biryani : స‌రికొత్త‌గా ఇలా ఆమ్లెట్ బిర్యానీ చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Omelette Biryani : మ‌నం కోడిగుడ్ల‌తో ఆమ్లెట్ ల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. సైడ్ డిష్ గా తిన‌డంతో పాటు ఈ ఆమ్లెట్ ల‌తో మ‌నం బిర్యానీని కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఆమ్లెట్ ల‌తో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా ఆమ్లెట్ బిర్యానీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఆమ్లెట్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆమ్లెట్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కోడిగుడ్లు – 4, ఉప్పు – త‌గినంత‌, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, మిరియాల పొడి – అర టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, అనాస పువ్వు – 1, జాపత్రి – కొద్దిగా, దాల్చిన చెక్క – ఒక అంగుళం ముక్క‌, స్టోన్ ప్ల‌వ‌ర్ – కొద్దిగాల‌వంగాలు – 4, సాజీరా – అర టీ స్పూన్, యాల‌కులు – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పుదీనా ఆకులు – గుప్పెడు, కొత్తిమీర – గుప్పెడు, త‌రిగిన ట‌మాటాలు – 2, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, నాన‌బెట్టిన బియ్యం – ఒక గ్లాస్, నీళ్లు – 2 గ్లాసులు, నెయ్యి – 2 టీ స్పూన్స్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

Omelette Biryani recipe in telugu make in this way
Omelette Biryani

ఆమ్లెట్ బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా ఆమ్లెట్ ల‌ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక గిన్నెలో కోడిగుడ్ల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, కొత్తిమీర, మిరియాల పొడి వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మంతో మ‌న‌కు కావ‌ల్సిన ప‌రిమాణంలో ఆమ్లెట్ ల‌ను వేసుకోవాలి. మ‌న‌కు త‌గిన‌న్ని ఆమ్లెట్ ల‌ను వేసుకున్న త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి వేయించాలి.

త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌సుపు, కారం, ఉప్పు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత బియ్యం వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇందులోనే నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై ఆమ్లెట్ ల‌ను ఉంచి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. నీరంతా పోయే వ‌ర‌కు మ‌ధ్య‌స్థ మంటపై ఉడికించిన త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి ఆవిరి పోయే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత దీనిని మ‌రో 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆమ్లెట్ బిర్యానీ తయార‌వుతుంది. దీనిని నేరుగా తిన్నా లేదా రైతాతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన బిర్యానీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts