Onion Kurma : చ‌పాతీల్లోకి ఘాటుగా ఉండే ఆనియ‌న్ కుర్మా.. ఇలా చేయండి..!

Onion Kurma : ఆనియ‌న్ కుర్మా.. ఉల్లిపాయ‌ల‌తో చేసే ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా ఈ కుర్మా చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా ఉల్లిపాయ‌ల‌తో కుర్మాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. అలాగే వెరైటీ రుచులు కోరుకునే వారు కూడా ఈ కుర్మాను రుచి చూడాల్సిందే అని చెప్ప‌వ‌చ్చు. ఈ కుర్మాను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ ఆనియ‌న్ కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆనియ‌న్ కుర్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీస్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, ట‌మాటాలు – 2, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చింత‌పండు పులుసు – పావు కప్పు, నీళ్లు – 200 ఎమ్ ఎల్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Onion Kurma recipe in telugu very tasty with chapatis
Onion Kurma

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టీ స్పూన్, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బ‌రి పొడి – 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్.

ఆనియ‌న్ కుర్మా త‌యారీ విధానం..

ముందుగా మ‌సాలా పేస్ట్ లో క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత జీడిప‌ప్పు, ఎండు కొబ్బ‌రి పొడి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత నువ్వులు వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చ‌ల్లారిన త‌రువాత జార్ లోకి తీసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనెలో వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. వీటిని మాడిపోకుండా వేయించిన త‌రువాత ట‌మాటాలను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి. అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి.

ఉల్లిపాయ ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్, చింత‌పండు పులుసు వేసి క‌ల‌పాలి. కూర బాగా ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. చివ‌గ‌రా కొత్తిమీరను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ కుర్మా త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ‌ల‌ను ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతో పాటు ఇలా కుర్మాను కూడా తయారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts