Pesarapappu Charu : పెస‌ర‌ప‌ప్పుతో చారు త‌యారీ ఇలా.. అన్నంలో క‌లిపి తింటే రుచిని ఆస్వాదిస్తారు..

Pesarapappu Charu : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు ధాన్యాల్లో పెస‌ర‌ప‌ప్పు ఒక‌టి. పెస‌ర‌ప‌ప్పును కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఈ ప‌ప్పు మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. దీనిలో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే వివిధ ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ల‌తో పాటు ప్రోటీన్స్ వంటి అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ఈ పెస‌ర‌ప‌ప్పుతో మ‌నం ప‌ప్పు కూర‌ల‌ను ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా పెస‌ర‌ప‌ప్పుతో ఎంతో రుచిగా ఉండే చారును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పెస‌ర‌ప‌ప్పుతో రుచిగా చారును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పెస‌ర ప‌ప్పుతో ప‌ప్పుచారు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెస‌ర‌ప‌ప్పు – ఒక టీ గ్లాస్, నీళ్లు – మూడు గ్లాసులు,ప‌సుపు – అర టీ స్పూన్, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ట‌మాటాలు – 2, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు -త‌గినంత‌, నాన‌బెట్టిన చింతపండు – 10 గ్రా., క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Pesarapappu Charu recipe in telugu this is the way to make
Pesarapappu Charu

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, క‌చ్చా ప‌చ్చ‌గా వెల్లుల్లి – 4, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

పెస‌ర‌ప‌ప్పుతో పప్పుచారు త‌యారీ విధానం..

ముందుగా ఒక కుక్క‌ర్ లో పెస‌ర‌ప‌ప్పును వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత ఒక గ్లాస్ నీళ్ల‌ను, త‌రిగిన ఉల్లిపాయ‌ల‌ను, ప‌చ్చిమిర్చిని, ప‌సుపును, ట‌మాట ముక్క‌ల‌ను వేయాలి. త‌రువాత కుక్క‌ర్ పై మూత‌ను ఉంచి మ‌ధ్య‌స్థ మంట‌పై 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, కారం, చింతపండు ర‌సం వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు, క‌రివేపాకు వేసి చారును పొంగు వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించి ప‌క్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మ‌రో గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత మ‌రిగించిన ప‌ప్పు చారును పోసి క‌ల‌పాలి. ఈచారును మ‌రో రెండు నిమిషాల పాటు మ‌రిగించి కొత్తిమీర చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పెస‌ర‌ప‌ప్పు ప‌ప్పు చారు త‌యార‌వుతాయి. వీటిని వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పెస‌ర‌ప‌ప్పుతో కూర‌ల‌నే కాకుండా ఇలా రుచిగా ప‌ప్పుచారును కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts