Ravva Burelu : ర‌వ్వ బూరెల‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Ravva Burelu : ర‌వ్వ‌తో మ‌నం వివిధ ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ర‌వ్వ‌తో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌వ్వ‌తో చాలా సుల‌భంగా త‌క్కువ స‌మ‌యంలో చేసుకోద‌గిన తీప‌వంట‌కాల్లో ర‌వ్వ బూరెలు కూడా ఒక‌టి. వీటిలో ర‌వ్వ అప్పాలు అని కూడా అంటారు. ర‌వ్వ బూరెలు చాలా రుచిగా ఉంటాయి. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు వీటిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ర‌వ్వ బూరెల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ర‌వ్వ బూరెల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉప్మా ర‌వ్వ – ముప్పావు క‌ప్పు, పాలు – అర క‌ప్పు, బెల్లం తురుము – ముప్పావు క‌ప్పు, నీళ్లు – పావు క‌ప్పు, యాల‌కులు – 3, ఉప్పు – చిటికెడు, గోధుమ‌పిండి – పావు క‌ప్పు, పొడి బియ్యంపిండి – పావు క‌ప్పు, త‌రిగిన జీడిపప్పు – కొద్దిగా, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా.

Ravva Burelu recipe in telugu very easy to make
Ravva Burelu

ర‌వ్వ బూరెల త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో ర‌వ్వ‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో పాలు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం క‌రిగిన త‌రువాత దీనిని మ‌రో 2 పొంగులు వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ముందుగా నాన‌బెట్టుకున్న ర‌వ్వ‌ను జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే యాల‌కులు కూడా వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, గోధుమ‌పిండి, బియ్యంపిండి వేసి క‌ల‌పాలి. త‌రువాత బెల్లం నీటిని పోసి క‌ల‌పాలి. ఇందులోనే జీడిప‌ప్పు, నెయ్యి వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక గంటెతో పిండిని తీసుకుని ఒకేసారి పిండి అంతా నూనెలో ఒకేద‌గ్గ‌ర వేయాలి. ఈ బూరె కాలి పైకి వ‌చ్చిన త‌రువాత అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ర‌వ్వ బూరెలు త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts