Restaurant Style Chicken Fry : రెస్టారెంట్ల‌లో ల‌భించే విధంగా చికెన్ వేపుడును ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయొచ్చు..!

Restaurant Style Chicken Fry : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది చికెన్ వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. చికెన్ తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రైను కూడా వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా తెలంగాణా స్టైల్ లో స్పైసీ చికెన్ ఫ్రై ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స్పైసీ చికెన్ ఫ్రై త‌యారీకి కావల్సిన పదార్థాలు..

నూనె – 4 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు, చిన్నగా తరిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు నీటిలో అర గంట పాటు నాన‌బెట్టిన చికెన్ – అర‌కిలో, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒకటిన్న‌ర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, చిక్క‌టి చింత‌పండు ర‌సం – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Restaurant Style Chicken Fry recipe in telugu how to make this
Restaurant Style Chicken Fry

స్పైసీ చికెన్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత చికెన్ ను వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై చికెన్ ను ఉడికించాలి.

చికెన్ అడుగు అంట‌కుండా మ‌ధ్య‌మ‌ధ్య‌లో క‌లుపుతూ అవ‌స‌ర‌మైతే ఒక‌టి లేదా రెండు టీ స్పూన్ల నీళ్లు వేస్తూ ఉడికించాలి. చికెన్ చ‌క్క‌గా వేగిన త‌రువాత చింత‌పండు ర‌సం, మిరియాల పొడి, కొత్తిమీర వేసి మ‌రో 5 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్పైసీ చికెన్ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే చికెన్ ఫ్రై కంటే ఈ విధంగా చేసిన చికెన్ ఫ్రై మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts