Sweet Samosa : స‌మోసాల‌ను తియ్య‌గా కూడా చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Sweet Samosa : మ‌నం స్నాక్స్ గా తీసుకునే వాటిల్లో స‌మోసాలు కూడా ఒక‌టి. స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే వీటిని మ‌నం మ‌న‌కు న‌చ్చిన రుచుల్లో త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. ఇది అంద‌రికి తెలిసిందే. కానీ మ‌న‌లో చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏమిటంటే మ‌నం స్వీట్ స‌మోసాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చి కోవాతో చేసే ఈ స్వీట్ సమోసాలు చిన్న‌గా, చాలా రుచిగా ఉంటాయి. వీటిని మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పండ‌గ‌ల‌కు, తీపి తినాల‌నిపించిన‌ప్పుడు, స్పెష‌ల్ డేస్ లో ఇలా స్వీట్ స‌మోసాల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ స్వీట్ స‌మోసాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్ స‌మోసా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదాపిండి – 200 గ్రా., వంట‌సోడా – పావు టీ స్పూన్, వేడి నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, సోంపు గింజ‌లు – ఒక టీ స్పూన్, ప‌చ్చి కోవా – ముప్పావు క‌ప్పు, యాల‌కుల పొడి – ఒక టీ స్పూన్, టూటీ ఫ్రూటీ – 2 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు ప‌లుకులు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బ‌రి పొడి – ఒక టేబుల్ స్పూన్, బొంబాయి ర‌వ్వ – ఒక టీ స్పూన్, నీళ్లు – 150 ఎమ్ ఎల్, పంచ‌దార – 2 క‌ప్పులు, ప‌టిక – అర స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Sweet Samosa recipe in telugu very tasty easy to make
Sweet Samosa

స్వీట్ స‌మోసా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో వంట‌సోడా, నెయ్యి, సోంపు గింజ‌లు వేసి క‌లపాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత మ‌రో గిన్నెలో కోవాను తీసుకోవాలి. ఇందులో యాల‌కుల పొడి, ర‌వ్వ‌, టూటీ ఫ్రూటీ, కొబ్బ‌రి పొడి, జీడిప‌ప్పు పలుకులు , ఒక టీ స్పూన్ నీళ్లు పోసి చేత్తో వ‌త్తుతూ బాగా క‌లుపుకోవాలి. త‌రువాత వీటిని చిన్న చిన్న గోళీలుగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో పంచ‌దార‌, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచ‌దార క‌రిగి గులాబ్ జామున్ పాకం వ‌చ్చిన త‌రువాత ప‌టిక వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకుని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చ‌ల్లుకుంటూ పొడ‌వుగా చ‌పాతీలాగా వ‌త్తుకోవాలి. త‌రువాత దీనిని మ‌ధ్య‌లోకి క‌ట్ చేసుకోవాలి.

ఇలా స‌మోసా షీట్ ల‌ను త‌యారు చేసుకున్న త‌రువాత ఒక్కో షీట్ ను తీసుకుంటూ అంచుల‌కు నీటితో త‌డి చేయాలి. త‌రువాత ఈ షీట్ ను స‌మోసా ఆకారంలో మ‌డిచి లోప‌ల కోవా ఉండ‌ను ఉంచాలి. త‌రువాత అంచుల‌ను మూసేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడ‌య్యాక స‌మోసాల‌ను వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. స‌మోసాలు వేగి పైకి తేలిన త‌రువాత స్ట‌వ్ ఆన్ చేసి మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. త‌రువాత ఈ స‌మోసాల‌ను తీసి పంచ‌దార పాకంలో వేసుకోవాలి. ఈ స‌మోసాల‌కు పాకాన్ని 3 నుండి 4 నిమిషాల పాటు ప‌ట్టించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ స‌మోసాలు త‌యార‌వుతాయి. వీటిని ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇవి కావాలంటారు.పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts