ఫ్రూట్ కేక్ తయారయ్యాక పొడి పొడిగా వుంటే ఒక టవల్ మడతపెట్టి కేక్ చల్లారే వరకు దానిమీద కప్పితే మెత్తగా అవుతుంది. బంగాళదుంపల చిప్స్ కరకరలాడాలంటే పసుపు రంగులో కనిపించే దుంపలను ఎంపికచేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తోలు తీసి, చిప్స్ వేయించేందుకు అనువైన ముక్కలుగా చేయాలి. నీళ్ళలోంచి తీసి వాటిపై మొక్కజొన్న పొడిని చల్లి వేయించాలి. బంగాళదుంప చిప్స్ మెత్తబడితే వాటిని నిముషం పాటు మైక్రోవేవ్ లో ఉంచితే కరకరలాడతాయి.
బెండకాయ వేపుతున్నప్పుడు జిగురొచ్చి కూర ముద్దలా అవుతుంది. బాండీలో ముక్కలు వేయగానే కాస్త మజ్జిగకూడా వేసి కలిపితే జిగురు రాదు. బెండకాయలు కడిగిన తరువాత ఓ పది నిముషాలు తడి ఆరనిచ్చి ముక్కలు కోసినట్లైతే తీగలు సాగకుండా ఉంటుంది. బాగా చల్లారిన పాలు తోడుకోవాలంటే మజ్జిగ చుక్కలతో పాటు చిన్న ఎండు మిరపకాయ వేస్తే సరి. బజ్జీలకు శనగపిండి కలిపే సమయంలో ఆ పిండిలో కాస్త బియ్యపు పిండి కలపండి. కాస్త వేడి నూనె కూడా ఈ పిండికి కలిపి , ఈ పిండితో బత్తాయి పండ్లని అయిదు నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచితే తొక్క కింద ఉండే తెల్లటి పొరని తేలిగ్గా వలిచేయవచ్చు.
మిగిలి పోయిన నిమ్మకాయ ఊరగాయను పప్పులో వేస్తే చాలా రుచిగా ఉంటుంది. మిరపకాయ బజ్జీలు వేసి, వేడి వేడిగా తిని చూడండి. ఎంత రుచిగా ఉంటాయో.