ఇటీవలి కాలంలో కొన్ని పెళ్లిళ్లు విషాదంగా మారుతున్నాయి. పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉండాలని భావించిన పెద్దలకి పెద్ద షాకే తగులుతుంది.మరికొన్ని గంటల్లో ఆనందోత్సాహాల మధ్య వివాహం జరగాల్సిన సమయంలో యువకుడు విగతజీవిగా మారడం చాలా సార్లు చూశాం. కుమారుడి పెళ్లి చూడాలన్న ఆ తల్లిదండ్రులు చనిపోయిన కొడుకుని చూసి బోరుమని విలపించడం ప్రతి ఒక్కరికి కంట కన్నీరు పెట్టించింది. ముఖ్యంగా గుండెపోటుతో యువకుడు మృతి చెందడం బాధని కలిగిస్తుంది.కాళ్లపారాణి ఆరనేలేదు. పెళ్లికి వేసిన పందిరి తీయనేలేదు. అప్పగింతలు కూడా పూర్తయ్యాయో లేదో.. అప్పుడే ఆ నవ వధువు కలలు ఆవిరి అయ్యాయి.
చిత్తూరు జిల్లా వి. కోట పట్టణలో పెళ్లయిన 5 రోజులకే నవ వరుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని వెంగసంద్రాకు చెందిన 28 ఏళ్ల కార్తీక్ అనే యువకుడికి ఇటీవలే పెళ్లయ్యింది. రామకుప్పం మండలం కొల్లుపల్లికి చెందిన భవాని అనే యువతితో ఐదు రోజుల కిందట పెళ్లి జరిగింది. అట్టహాసంగా పెళ్లి జరిగిన తర్వాత అందరు చాలా సంతోషంగా ఇంటికి వెళ్లారు. అప్పగింతల కార్యక్రమాలు కూడా పూర్తి కావడంతో కొత్త జంట తమ ఇంటికి వెళ్లింది. ఇక దాంపత్య జీవితం సంతోషంగా సాగిద్దామని ఆ కొత్త జంట భావిస్తున్న సమయంలో దురదృష్టం వెంటాడింది. శుక్రవారం ఐదవరోజు కార్తీక్ అత్తగారింటికి వచ్చాడు. అయితే అనారోగ్యంగా ఉందంటూ భార్యను తీసుకుని ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్లాడు.
అయితే ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే గుండెపోటుతో చనిపోయాడని కొంతమంది చెప్తున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కార్తీక్ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆందోళనకు చేపట్టారు. మరోవైపు సమాచారం తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మరి కార్తీక్ మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.