Digestive System : ప్రస్తుత తరుణంలో చాలా మంది పొట్టలో గ్యాస్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొన్ని సార్లు మలం ప్రేగు ద్వారా వచ్చే ఈ గ్యాస్ దుర్వాసనను కలిగి ఉంటుంది. ఇలా గ్యాస్ దుర్వాసనను కలిగి ఉండడం వల్ల మనతోపాటు ఇతరులు కూడా ఇబ్బంది పడుతుంటారు. 90 శాతం మంది ప్రజలు దుర్వాసనతో కూడిన గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ దుర్వాసనను వెదజల్లడానికి ప్రధాన కారణం మలబద్దకం. మన శరీరంలో ఉండే ప్రేగులల్లో మలం ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల ఆ మలం పులిసి గ్యాస్ తోపాటు, దుర్వాసనను విడుదల చేస్తుంది. ఈ దుర్వాసన.. మలం నుండి తయారయిన గ్యాస్ తో కలుస్తుంది. దీంతో మలం ప్రేగు ద్వారా బయటకు వచ్చే గ్యాస్ దుర్వాసనను వెదజల్లుతుంది.
మన ప్రేగులల్లో మలం నిల్వ ఉండే సమయాన్ని బట్టి మలం ప్రేగు ద్వారా బయటకు వచ్చే గ్యాస్ వాసన మారుతూ ఉంటుంది. అంతేకాకుండా కూరగాయలను, పండ్లను, దుంపలను తినడం ద్వారా తయారయిన మలం.. ప్రేగులల్లో నిల్వ ఉన్నా కూడా ఆ మలం ఎక్కువగా దుర్వాసనను, గ్యాస్ లను విడుదల చేయదు. కానీ కందిపప్పు, శనగపప్పు , పెసరపప్పు వంటి పప్పులతోపాటు వాటితో తయారు చేసిన మొలకలను తినడం ద్వారా తయారయిన మలం.. ప్రేగులల్లో నిల్వ ఉండడం వల్ల ఆ మలం దుర్వాసనతోపాటు గ్యాస్ ను కూడా అధికంగా విడుదల చేస్తుంది.
పప్పులల్లో మాంసకృత్తులు అధికంగా ఉండడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. ఈ సమస్యను కలిగి ఉన్న వారు ఉదయం లేచిన వెంటనే లీటరున్నర నీళ్లను తాగాలి. ఒకే సారి తాగలేని వారు కొద్ది కొద్దిగా లీటరున్నర నీటిని తాగి ఏకాగ్రత అంతా మలవిసర్జన పైనే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో మల విసర్జన జరుగుతుంది. ఒకసారి మల విసర్జన జరిగిన తరువాత రెండు నుంచి మూడు గంటల వరకు ఎటువంటి ఆహారాన్ని తినకుండా మరలా లీటరున్నర నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల ప్రేగులల్లో నిల్వ ఉన్న మలం పూర్తిగా విసర్జించబడుతుంది.
ఈ సమస్య లేని వారు కూడా ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది. ప్రేగులల్లో మలం నిల్వ ఉండదు. కనుక మలం నుండి ఎక్కువగా గ్యాస్, దుర్వాసన విడుదల అవకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మలం.. ప్రేగు నుండి విడుదల అయ్యే గ్యాస్.. దుర్వాసనను వెదజల్లకుండా ఉంటాయి. మలబద్దకం సమస్య నుండి బయట పడవచ్చు.