Copper Ring : చాలా మంది, మంచిదని రాగి ఉంగరాన్ని పెట్టుకుంటున్నారు. రాగి ఉంగరాన్ని, పెట్టుకోవడం వలన, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. సానుకూల అనుభూతి కలుగుతుంది. రాగి ఉంగరాన్ని ధరించడం వలన, కోపం కూడా కంట్రోల్ లో ఉంటుంది. కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు, రాగి ఉంగరాన్ని ధరిస్తే, మంచిదని వేద శాస్త్రంలో కూడా చెప్పబడింది. అలానే, సూర్యుడు కుజుడు జాతకంలో అనుకూల స్థితిలో ఉండాలంటే, రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం ఉత్తమం. చెడు ప్రభావం కూడా రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన తగ్గుతుంది.
వ్యక్తిత్వ వికాసానికి కూడా, రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం మంచిది. రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన, ఎటువంటి లాభాలని పొందవచ్చు..?, ఏ సమస్యలు తొలగిపోతాయి అనే విషయాలని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో రాగి ఉంగరాన్ని స్వచ్ఛమైన పవిత్రమైన ఉంగరంగా భావించడం జరుగుతుంది. పూర్వకాలం నుండి కూడా చాలామంది చేతికి రాగి ఉంగరాన్ని పెట్టుకునేవారు. రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం అంటే, సూర్యుడు అంగారకుడికి చెందిన లోహంగా భావిస్తారు.
వాటి వలన కలిగే వ్యాధుల్ని, ఈ ఉంగరం నయం చేస్తుంది. అంతేకాకుండా, రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన, శరీరంలో వేడి బాగా తగ్గిపోతుంది రక్తపోటు గుండెపోటు రాకుండా కాపాడుతుంది. తలనొప్పితో బాధపడే వాళ్ళు, రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన రిలీఫ్ కూడా కలుగుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి కూడా రాగి ఉంగరం ఉపయోగపడుతుంది.
శరీరంలో ఉండే నొప్పులను కూడా, ఇది దూరం చేస్తుంది. ఉపశమనాన్ని ఇస్తుంది. రాగి పాత్రలో ఉంచిన నీళ్లు తాగడం వలన, చాలా ప్రయోజనాలని పొందవచ్చు. వాస్తు దోషాలు కూడా దూరం అవుతాయి. రాగి పాత్రని ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, వాస్తు దోషాలని తొలగించడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇంటిగుమ్మము ముందు రాగి నాణాన్ని వేలాడ తీయడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇలా, రాగి ఉంగరం వలన రాగివలన ఇన్ని లాభాలని మనం పొందవచ్చు.