చూడటానికి ఆరోగ్యంగా వున్నా, చూపులు మోసం చేయవచ్చు. ఆరోగ్యంగా కనపడుతూ, సన్నగా వుండే భారతీయులు లావుగా వుండే తెల్లవారికంటే కూడా గుండె జబ్బులకు అధిక రిస్కు కలిగి వుంటారు. దీనికి కారణాలు కనిపెట్టినట్లు సైంటిస్టులు చెపుతున్నారు. ఒక తాజా అధ్యయనం మేరకు, దక్షిణ ఆసియా నివాసులు తమ అంతర్గత అవయవాలకు అంటే లివర్ మొదలగువాటికి అధిక కొవ్వును కలిగి వుంటారని, దీని కారణంగా బరువు పెరిగిపోతారని, అయితే, ఇతర ప్రాంతాలజాతుల వారు కొవ్వును తమ నడుము వద్ద మాత్రమే కలిగి వుంటారని కనిపెట్టారు.
కనుక ఆరోగ్యంగానే బయటకు కనపడే భారతీయులలో గుండెజబ్బులు, మెటబాలిక్ సమస్యలు అధికంగా ఎందుకొస్తున్నాయనేది దీన్నిబట్టి అర్ధం అవుతోంది. దక్షిణ ఆసియా వాసులలో అంతర్గత అంగాలకు అంటుకుని పెరిగే కొవ్వు అధికం కావటం చేతే డయాబెటీస్, గుండె జబ్బులు వస్తున్నాయని మెక్ మాస్టర్ యూనివర్శిటీకి చెందిన డా. సోనియా ఆనంద్ పేర్కొన్నట్లు ప్లస్ వన్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఇతర ప్రాంత తెల్లవారితో పోలిస్తే, ఆసియావాసులకు చర్మం క్రింద కొవ్వు పెట్టుకోడానికి తక్కువ జాగా వుందని రీసెర్చర్లు చెపుతున్నారు.
ఈ రకంగా వున్న కొవ్వు పొట్టలో వున్న లివర్ కు ఇతర అంగాలకు చేరిపోతుంది. దానితో గ్లూకోజు, అధికమొత్తాలలో ఇతర ద్రవాలు ఊరి చివరకు గుండె సమస్యలకు దోవతీస్తుంది. దక్షిణాసియా ప్రజలు ఆరోగ్యవంతులైనప్పటికి ఇతర దేశాల తెల్లవారితో పోల్చితే మెటబాలిజం ప్రక్రియ తక్కువలో వుంది. భారతదేశ ఉపఖండ ప్రజలలోనుండి వచ్చే రోగులను ట్రీట్ చేయటంలో వైద్యులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనానికి సహకరించిన కెనడియన్ ఒబేసిటీ నెట్ వర్క్ డైరెక్టర్ డా. ఆర్య శర్మ తెలిపారు.