మనకు పోషకాలను అందించే ఆహారాలను బాగా తినాలి. ప్రతిరోజూ తినేది సంతులిత ఆహారంగా వుండాలి. అందుకుగాను, చిట్కాగా మీ ఆహార పళ్ళెంలో అన్ని రంగులూ కనపడుతున్నాయో లేదో పరిశీలించండి. మీ ఆహారం ప్లేటు ఆహారాల రంగులు ఒక ఇంద్రధనస్సు కలిగిన రంగులన్ని కలిగి వుండాలి. ఏ ఏ రంగులు ఏ రకమైన పోషకాలను ఇస్తాయో పరిశీలించండి. 1. ఆకుపచ్చ ఆహారం – సాధారణంగా ఆకుపచ్చని ఆహారాలు అందరూ తినేవే. ఆకుపచ్చని ఆహారాలు కంటి చూపుకు మంచివి. వయసుమళ్ళినట్లు కనపడకుండా చేస్తాయి. వీటిలో విటమిన్ బి అధికం. ఫోలేట్ వుంటుంది. ఆకుపచ్చని కూరలు అంటే…కీర, ఆకుకూరలు మొదలైనవి.
2. ఎరుపు రంగు కూరలు, పండ్లు – కేన్సర్ తో పోరాడే పదార్ధాలుంటాయి. ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు మీ కణాలకు జీవంపోసి చిన్నవారుగా వుండేలా చేస్తాయి. బీట్ రూట్, దానిమ్మ వంటివి బ్లడ్ కౌంట్ పెంచుతాయి. టమాటా, రెడ్ పెప్పర్, బెర్రీ వంటివి తినండి. 3. పసుపు రంగు పండ్లు, కూరలు – ఈ పండ్లు కళ్ళకు మంచిది. కండలు ఏర్పరుస్తాయి. ఊపిరితిత్తులు శుభ్రపరుస్తాయి. సిట్రస్ పండ్లు, ఎనర్జీ ఇస్తాయి. వీటిలో కెరోటిన్ వుంటుంది కనుక నొప్పులు లేకుండా చేస్తాయి. అరటిపండు, ఆరెంజ్, మామిడిపండు, గుమ్మడి, కేరట్ మొదలైనవి తినాలి.
4. లేత ఎరుపు రంగు పండ్లు, కూరలు – ఎగ్ ప్లాంట్, ప్రూనే, బ్లూబెర్రీ, గ్రేప్, మొదలైనవి. కేన్సర్ తో పోరాడుతాయి. మంచి జ్ఞాపక శక్తినిస్తాయి. కనుక మీ ఆహారం ప్లేటు అన్ని రంగులతో కూడిన పండ్లు, కూరలు కలిగినదిగా వుంటే, మీ ఆరోగ్యం అద్భుతంగా వుందంటున్నారు పోషకాహార నిపుణులు.