మనం రోజూ వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో.. రోజూ తగినన్ని గంటల పాటు కూడా నిద్రించాలి. ముఖ్యంగా రాత్రి పూట కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్ర అవసరమని వైద్యులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే కనీసం 6 గంటల పాటు అయినా నిద్రించకపోతే ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిత్యం కనీసం 6 గంటల పాటైనా నిద్రించకపోతే శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయి. దీంతో శక్తి సరిగ్గా ఖర్చు కాదు. మెటబాలిజం తగ్గుతుంది. క్యాలరీలు ఖర్చుకాక శరీరంలో శక్తి అలాగే ఉండిపోతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా థైరాయిడ్ వంటి సమస్యలు వస్తాయి. అధికంగా బరువు పెరుగుతారు.
2. రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించకపోతే ఏకాగ్రత తగ్గుతుంది. దేనిపై కూడా సరిగ్గా దృష్టి పెట్టలేరు. పని చేయాలన్న ఆసక్తి తగ్గుతుంది.
3. రోజూ సరిగ్గా నిద్రపోక పోతే శరీరానికి సోమరితనం అలవాటు అవుతుంది. రోజూ బద్దకంగా ఉంటారు. ఉత్సాహం ఉండదు. కొందరికైతే మద్యం సేవించినట్టు మత్తుగా ఉంటుంది. దీంతో యాక్టివ్‌గా పనిచేయలేరు. ఇది పనిపై ప్రభావం చూపుతుంది.
4. నిద్ర సరిగ్గా పోకపోతే అది మెదడుపై డైరెక్ట్‌గా ప్రభావం చూపుతుంది. దీంతో మెదడు పనితనం నెమ్మదిస్తుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఏదీ సరిగ్గా గుర్తు పెట్టుకోలేకపోతారు.
5. రోజూ తగినన్ని గంటల పాటు నిద్రపోని పురుషుల్లో వీర్యం ఉత్పత్తి తగ్గుతుంది. ఉత్పత్తి అయినా నాణ్యత ఉండదు. దీంతో సంతానం కలిగే అవకాశాలు సన్నగిల్లుతాయి.
6. రోజూ కనీసం 6 గంటల పాటు అయినా నిద్రపోకపోతే డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు వస్తాయి. సంతోషంగా ఉండలేరు.
7. రోజూ తగనన్ని గంటల పాటు నిద్రించకపోతే అది చర్మంపై ప్రభావం చూపిస్తుంది. చర్మం ముడతలు పడుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి. కనుక రోజూ తగినన్ని గంటల పాటు కచ్చితంగా నిద్రించాలి.