కొబ్బరినీళ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ నీటిని తాగితే శరీరంలోని ద్రవాలు సమతుల్యంలోకి వస్తాయి. అంతేకాదు శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇంకా అనేక రకాల ఇతర ప్రయోజనాలు కూడా కొబ్బరి నీటితో మనకు ఉన్నాయి. అయితే కొబ్బరి నీళ్ల ను పరిమితికి మించి ఎప్పుడూ తాగకూడదు. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయట. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తాగితే కండరాల నొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి. కొబ్బరి నీళ్లు సహజ సిద్ధమైన లాక్సేటివ్ గుణాలను కలిగి ఉంటాయి. ఈ క్రమంలో కొద్ది మొత్తంలో కొబ్బరి నీటిని తాగితే సులభంగా విరేచనమవుతుంది. మలబద్దకం పోతుంది. కానీ ఎక్కువ కొబ్బరి నీళ్లను తాగితే అది వికటించి డయేరియా, వాంతులు, వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
కొబ్బరి నీళ్లు డైయురెటిక్ గుణాలను కలిగి ఉంటాయి. ఈ క్రమంలో ఎక్కువగా కొబ్బరి నీళ్లను తాగితే తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. మధుమేహ వ్యాధి ఉన్నవారు వీలైనంత వరకు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండడమే మంచిది. లేదంటే ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను గణనీయంగా పెంచుతాయి. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే సాధారణ వ్యక్తులు కూడా ఎక్కువగా కొబ్బరి నీటిని తాగితే శరీరంలో ఇన్సులిన్‌పై ప్రభావం పడుతుంది. దీంతో వారి రక్తంలోనూ చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
శరీరాన్ని చల్లబరిచే గుణం కొబ్బరినీళ్లకు ఉంది. అయితే జలుబు, దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉన్న వారు, అవి ఇప్పటికే ఉన్నవారు కొబ్బరి నీళ్లను తాగకపోవడమే మంచిది. లేదంటే అనారోగ్య సమస్యలు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. కొబ్బరి నీళ్లలో చక్కెర పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని మోతాదుకు మించి తాగితే అదంతా శరీరంలో కొవ్వుగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటిని ఎక్కువగా తాగకూడదు. ఆపరేషన్ చేయించుకునే వారు 2 వారాలకు ముందు నుంచే కొబ్బరి నీళ్లను తాగడం మానేయాలి. ఎందుకంటే అవి బీపీపై ప్రభావం చూపుతాయి.
కొబ్బరి నీళ్లలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగితే క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. నట్స్ అంటే అలర్జీ ఉన్నవారు కొబ్బరి నీళ్లను తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ అలర్జీలు కొబ్బరినీళ్లతో ఇంకా ఎక్కువ అవుతాయి.