ఎల్లప్పుడూ యంగ్‌గా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. చర్మం కాంతివంతంగా ఉండాలని, మెరిసిపోవాలని అనుకుంటారు. కానీ చాలా మందికి యుక్త వయస్సులోనే ముఖంపై ముడతలు వస్తుంటాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తుంటాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. ముఖ సౌందర్యం తగ్గిపోతుండడంతో ఆందోళన చెందుతుంటారు. దీని వల్ల చర్మం మరింత ముడతలు పడుతుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే 4 పనులను మీరు నిద్రించే ముందు చేస్తే చాలు. దాంతో మీరు ఎల్లప్పుడూ యంగ్‌గా కనిపించవచ్చు. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి నిద్రకు ముందు మీరు 5 బాదంపప్పులు, 1 వాల్‌నట్, కొన్ని పొద్దు తిరుగుడు విత్తనాలను నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం వీటిని పరగడుపునే తినండి. ఇవి మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటి ప్రభావం మీ చర్మంపై కూడా పడుతుంది. ఇవి మీ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. యంగ్‌గా కనిపించేలా చేస్తాయి. కనుక క్రమం తప్పకుండా రోజూ వీటిని తీసుకునే ప్రయత్నం చేయండి. దీంతో ఆటోమేటిగ్గా కొన్ని రోజులకు మీ చర్మంలో కచ్చితంగా మార్పు వస్తుంది. మీ చర్మాన్ని మీరే గుర్తు పట్టలేనంత యవ్వనంగా కనిపిస్తారు.
ప్రస్తుతం చాలా మంది తగినన్ని గంటలపాటు నిద్రించడం లేదు. దీని ప్రభావం కూడా చర్మంపై పడుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే ముఖంపై త్వరగా ముడతలు వస్తాయి. అలాగే కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతాయి. కనుక రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు అయినా నిద్రించే ప్రయత్నం చేయాలి. మధ్యలో ఎలాంటి అవాంతరాలు ఉండకుండా చూసుకోండి. నిద్రకు ఒక గంట ముందు ఫోన్లు, కంప్యూటర్, టీవీ చూడడం మానేయండి. దీని వల్ల మీ చర్మంపై నెగెటివ్ ప్రభావం పడదు. చర్మం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు.
రాత్రి పూట ఎట్టి పరిస్థితిలోనూ లైట్స్‌ను ఆఫ్ చేసి నిద్రించాలి. కొందరు లైట్లను ఆన్ చేసి నిద్రిస్తుంటారు. దీని వల్ల కాంతి మీపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. మీ నిద్రపై ఎఫెక్ట్ పడుతుంది. కనుక నిద్రించేటప్పుడు లైట్స్‌ను ఆఫ్ చేయాలి. అలాగే రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని పాలలో కాస్త పసుపు కలుపుకుని తాగాలి. ఖర్జూరాలు, యాలకులు, కుంకుమ పువ్వు వంటి వాటిని పాలలో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఇలా రోజూ రాత్రి నిద్రకు ముందు ఈ సూచనలు పాటిస్తే మీరు ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంటారు. వృద్ధాప్య ఛాయలు కనిపించవు. అంత త్వరగా చర్మం ముడతలు పడదు.