Foods For Energy : ప్రస్తుత కాలంలో సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోని కారణంగా మనలో చాలా మంది నీరసం, నిస్సత్తువ, బలహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారు. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతారు. చిన్న పని చేయగానే అలసిపోతుంటారు. బలహీనత కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం కూడా ఉంది. నీరసం, బలహీనతలతో బాధపడే వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక మనం నీరసాన్ని, బలహీనతను వీలైనంత త్వరగా దూరం చేసుకోవాలి. నీరసం, బలహీనత వంటి వాటితో బాధపడే వారు కింద తెలియజేసే చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ చిట్కాను వాడడం వల్ల నీరసం దూరమయ్యి శరీరానికి తగినంత, శక్తి లభిస్తుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల మనం ఎల్లప్పుడూ ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. నీరసాన్ని, అలసటను, బలహీనతను దూరం చేసే ఈ చిట్కా ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం పుట్నాల పప్పును, బెల్లాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో రెండు గుప్పెల పుట్నాల పప్పును తీసుకోవాలి. తరువాత ఇందులో రెండు టీ స్పూన్ల బెల్లాన్ని వేసి కలపాలి. అంతే ఇలా చేయడం వల్ల నీరసాన్ని, బలహీనతను దూరం చేసే చిట్కా తయారవుతుంది. ఈ విధంగా పుట్నాల పప్పును, బెల్లాన్ని కలిపి రోజూ ఉదయం తీసుకోవాలి. వీటిని తీసుకున్న పావు గంట తరువాత ఒక గ్లాస్ పాలను తాగాలి. ఇలా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత శక్తి లభిస్తుంది.
పుట్నాల పప్పు, బెల్లం, పాలు ఇవి మూడు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు ఉంటాయి. పాలు, బెల్లం, పుట్నాల పప్పును తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కండరాలు బలంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. నీరసం, బలహీనతలతో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల బలంగా, పుష్టిగా అవ్వవచ్చు. ఈ చిట్కాను పాటించిన 3 రోజుల్లోనే మన శరీరంలో వచ్చే మార్పును మనం గమనించవచ్చు.