Foods For Kidneys : మన శరీరంలో మలినాలను, విష పదార్థాలను బయటకు పంపించడంలో మూత్రపిండాలు కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే మన శరీరంలో అనేక విధులను మూత్రపిండాలు నిర్వర్తిస్తాయి. మూత్రపిండాలు కనుక వాటి విధులను అవి సక్రమంగా నిర్వర్తించకపోతే మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. కనుక మనం మూత్రపిండాల ఆరోగ్యంపై తగిన శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం. అయితే మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా దాదాపు 100లో 10 మంది మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తలెత్తగానే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. లేదంటే తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది.
మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు వైద్యులు సూచించిన మందులతో పాటు వారి యొక్క ఆహారపు అలవాట్లల్లో మార్పు చేసుకోవడం వల్ల చాలా సులభంగా ఈ సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు సోడియం ఉండే ఆహారాలను చాలా తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా ఉప్పును చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. దెబ్బతిన్న మూత్రపిండాలు శరీరంలో ఎక్కువగా ఉన్న సోడియంను బయటకు పంపించలేవు. దీంతో శరీరంలో అధికంగా ఉండే సోడియం వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కనుక రోజూ 2000 మిల్లీ గ్రాముల కంటే తక్కువ మోతాదులో ఉప్పును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే మన శరీరానికి పొటాషియం కూడా చాలా అవసరం.
కానీ మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాగే మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారు ఫాస్పరస్ ఎక్కువగా ఉండే ఆహారాలను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. రోజూ 800 నుండి 1000 మిల్లీ గ్రాముల కంటే తక్కువ మోతాదులో ఫాస్ఫరస్ శరీరానికి అందేలా చూసుకోవాలి. ఇక మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు క్యాలీప్లవర్ ను ఎక్కువగా తీసుకోవాలి. దీనిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. అలాగే క్యాలీప్లవర్ లో పొటాషియం, సోడియం, ఫాస్పరస్ వంటి మినరల్స్ కూడా తక్కువ మోతాదులో ఉంటాయి. కనుక క్యాలీప్లవర్ ను తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా రెడ్ గ్రేప్స్ ను తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో విటమిన్ సి పాటు ప్లేవనాయిడ్స్ కూడాఅధికంగా ఉంటాయి. డయాబెటిస్ కారణంగా మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతినకుండా చేయడంలో రెడ్ గ్రేప్స్ మనకు ఎంతో దోహదపడతాయి. అలాగే మన ఆహారంలో భాగంగా బ్లూబెర్రీస్ ను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ కారణంగా మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడడంలో సహాయపడతాయి. అలాగే మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు కోడిగుడ్డు తెల్లసొనను, మెకడమియా నట్స్ ను కూడా ఆహారంగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలు తగ్గడంతో పాటు లేని వారికి కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.