మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో చేమ దుంపలు ఒకటి. వీటితో కొందరు ఫ్రై చేసుకుంటారు. కొందరు పులుసు పెట్టుకుంటారు. అయితే ఇవి చక్కని రుచిని అందివ్వడమే కాదు శక్తిని, పోషకాలను ఇస్తాయి. అందువల్ల వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటంటే..
1. అధిక రక్తపోటు బాధించినట్లు లోబీపీ కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాంటి వారు పొటాషియం అధికంగా ఉండే చేమ దుంపలను తింటే మంచిది.
2. ఈ దుంపల్లో గ్లూటెన్ ఉండదు. ఇందులో ఉండే ఫైటో న్యూట్రియెంట్లు శరీరంలో పీచు, యాక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. దీని వల్ల జీర్ణ సమస్యలు ఉండవు.
3. చేమదుంపలను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.
4. ఈ దుంపలను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి లభిస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తుంది.
5. బరువు తగ్గాలనుకునే వారు ఈ దుంపలను తరచూ తింటే మేలు జరుగుతుంది.
6. చేమ దుంపల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందువల్ల ఇది గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
7. ఈ దుంపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365