Health Tips : చర్మ సౌందర్యాన్ని పెంచుకునేందుకు మరియు నిత్యం యవ్వనంగా కనిపించేందుకు ప్రస్తుతం అనేక మంది మార్కెట్లో ఉన్న సౌందర్య సాధన ఉత్పత్తులను వాడుతుంటారు. కానీ నిజానికి అవి పెద్దగా పనిచేయక వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి నిరాశకు గురి అవుతూ ఉంటారు. అయితే మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన చర్మ నిగారింపు ఆధారపడి ఉంటుందనే విషయం అందరూ తెలుసుకోవాలి. మానవ శరీరానికి తగినంత ప్రోటీన్‌లు, పోషకాలను అందించకపోతే.. చర్మం తాజాగా, యవ్వనంగా కనిపించదన్నది అసలు విషయం. కేవలం మనం తినే ఆహారంతోనే చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. మనం రోజూ తీసుకునే ఆహారంలో వీటిని చేర్చుకుంటే మీ చర్మానికి నిగారింపు వస్తూ నిత్య యవ్వనంగా కనపడతారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. పదండి వాటిపై ఓ లుక్కేద్దాం.
నారింజ : నారింజ పండులో విటమిన్ సి ఉంటుంది. దీన్ని తరచూ తింటూ ఉంటుంటే ఎన్నో ఫలితాలను పొందవచ్చు. మంచి ఆరోగ్యంతో పాటు చర్మం మెరిసేలా చేస్తుంది. నారింజాను తిన్న అనంతరం మిగిలిపోయిన తొక్కలను ముఖం మీద అప్లై చేసినా, లేక వాటిని ఎండ బెట్టి ఫేస్ ప్యాక్‌లలో ఉపయోగించినా.. అది మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
యాపిల్ : ప్రతి రోజు ఒక యాపిల్ తింటే హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదనే సామెత వినే ఉంటారు. యాపిల్స్ లో ఉండే విటమిన్ ఏ, సీలతో పాటు యాంటీ యాక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ మీ చర్మానికి రక్షణ ఇస్తుంది.
పుచ్చకాయ : మంచి టేస్ట్ తో పాటు దాదాపు 92 శాతం నీరు ఉండే పుచ్చ కాయలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా ఇందులోని విటమిన్ సీ, ఏ, బీ1 చర్మానికి కాంతిని చేకుర్చుతాయి. వయసుతో పాటు చర్మంపై వచ్చే ముడతలకు చెక్ పెట్టి యవ్వనంగా కనబడేలా చేస్తుంది.
నిమ్మకాయ : నిమ్మకాయలు కూడా చర్మానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నిమ్మను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాకుండా వీటి ద్వారా చర్మం డీహైడ్రేట్‌కు గురికాకుండా ఉంటుంది. నిమ్మరసాన్ని జ్యూస్ గా తాగడంతో పాటు దాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే మెటిమలు, మచ్చలు తగ్గుతాయి.
కీర దోసకాయ : కీర దోసకాయను అన్ని బ్యూటీ పార్లర్లలోనూ ఉపయోగిస్తున్నారు అనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది. కీర దోసకాయ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్‌లు, విటమిన్ సీ, కేలు చర్మం ప్రకాశవంతంగా మెరవడానికి దోహదపడతాయి. కళ్ళ కింద ఏర్పడిన నల్లటి బ్లాక్ సర్కిళ్లను తొలగించడానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి.