నేటి ఫ్యాషన్ ప్రపంచంలో అవర్ గ్లాస్ వంటి 36-24-36 కొలతలకున్న ప్రాధాన్యత మరో దానికి లేదు. నేటి యువతరం శారీరక ధారుఢ్యానికి, నాజూకుకు వివిధ రకాల వ్యాయామాలను చేస్తున్నారు. అందుకుగాను ఎన్నో రకాల ఆహారపుటలవాట్లు పాటిస్తున్నారు. మీరుకూడా చక్కని అంగ సౌష్టవం కలిగి అంగాంగ ప్రదర్శనలు చేయాలనుకుంటుంటే, లేదా చక్కటి ఆరోగ్యాన్ని దేహ సౌష్టవాన్ని కలిగి వుండాలంటే దిగువ ఇవ్వబడిన డైట్ చిట్కాలను పాటించండి. వంపు సొంపుల శారీరక ఆకర్షణ పొందండి. మొట్టమొదటిగా మీరు ఏ రకం ఆహారం తీసుకుంటున్నారనేది గమనించండి. ఎప్పుడు ఏది తిన్నప్పటికి కొంచెం ఆలోచించి తినండి.
జంక్ ఫుడ్ లు మిమ్మల్ని లావుగా చేస్తాయని చాలామంది చెబుతారు. రెడీమేడ్ ఆహార పదార్ధాలకు, ఉప్పు, షుగర్ మొదలగు వాటిని దూరంగా వుంచండి. ఇక సన్నటి నాజూకైన శరీరం మీ సొంతంగా భావించండి. శరీరంలోని మలినాలు పొగొట్టుకునేందుకు, శరీరం లోపలి భాగాలు శుభ్రపడేటందుకు నీరు అధికంగా తాగండి. నీరు అధికంగా తాగినందువల్ల కూడా మీరు ఆహారం తక్కువ పరిమాణంలో తీసుకుంటారు. ఉప్పు వున్న పదార్ధాలు మీ శరీరంలో అధిక ద్రవాన్ని నిలువ చేస్తాయి. కనుక వాటికి దూరంగా వుండండి.
శరీరంలో విష పదార్ధాలైన చెమట, మూత్రం, మలం మొదలగు వాటిని వెంట వెంటనే విసర్జించండి. చెమట వచ్చేటంతవరకు వ్యాయామాలు చేయండి. చేసే వ్యాయామాలు పొట్టను తగ్గించేవిలా చూడండి. కొద్దిపాటి గుండె సంబంధిత వ్యాయామాలు కూడా మీరు రోజంతా ఫిట్ గా వుండేలా చేస్తాయి. శరీర అవయవాలను ఒక క్రమ పద్ధతిలో మెలితిప్పగల యోగాసనాలు కూడా మీరు కోరుకునే 36-24-36 శరీరానికి తోడ్పడగలవు. వీటితో నడుము, పొట్ట మొదలైన భాగాలు అధికంగా ప్రభావించబడతాయి. బాడీ బిల్డింగ్ కూడా మీ శరీర ఛాతీ భాగాన్ని, దిగువ భాగాన్ని బాగా ప్రభావితం చేయగలదు. శరీర కండలకు దారుఢ్యాన్నిచ్చే బస్కీలు, బరువులు ఎత్తడం, మొదలైనవి కూడా శరీరానికి అవసరమైన కండలను, ఒంపు సొంపులను కలిగిస్తాయి.