Himalayan Gold : కార్డిసెప్స్ ఫంగస్.. కీటకాల లార్వాపై పెరిగే ఒకరకమైన శిలీంధ్రం ఇది. దీనిని శాస్త్రీయంగా ఓఫియోకార్డిసెప్స్ సినెన్సిస్ అని అంటారు. అలాగే దీనిని హిమాలయన్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా టిబెట్, భూటాన్, చైనా, నేపాల్, ఇండియాలోని ఎత్తైన హిమాలయ పర్వతాల్లో లభిస్తుంది. దీనిని చైనా వారు బంగారం కంటే ఎక్కువగా భావిస్తారు. గొంగళి పురుగు మరియు ప్రత్యేకమైన శిలీంధ్రాల కలయికతో ఇది ఏర్పడుతుంది. ఈ కార్డిసెప్స్ గోధుమరంగులో రెండు అంగుళాల పొడవు ఉంటుంది. అలాగే దీనిని ఔషధ రూపంలో తీసుకుంటారు.
యాంటీ వైరల్ గా అలాగే క్యాన్సర్ నివారణలో దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే అలసటను తగ్గించడంలో, శరీరానికి బలాన్ని చేకూర్చడంలో, జ్ఞాపకశక్తిని పెంచడంలో,వృద్దాప్య ఛాయలు దరి చేరకుండా చేయడంలో, శరీరంలో మంటను తగ్గించడంలో, లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో ఇలా అనేక రకాలుగా కార్డిసెప్స్ మనకు సహాయపడుతుంది. చైనాలో దీనిని బంగారం, వజ్రాల కంటే విలువైనది భావిస్తారని నివేదికలు చెబుతున్నాయి. కార్డిసెప్స్ చాలా ఖరీదుతో కూడుకున్నది. ఒక కిలో కార్డిసెప్స్ దాదాపు 65 లక్షల రూపాయల విలువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
దీనిని ఒక సంవత్సరం పాటు 3 నుండి 6 గ్రాముల మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల అతిసారం, మలబద్దకంతో పాటు ఇతర పొట్ట సమస్యలు తగ్గుతాయి. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలు, నపుంసకత్వం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే క్రమంగా ఈ కార్డిసెప్స్ ఫంగస్ నిల్వలు తగ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.