Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

మీకు పీడ‌క‌లలు త‌ర‌చూ వ‌స్తున్నాయా..? అయితే జాగ్ర‌త్త‌..!

Admin by Admin
February 6, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చిన్నపిల్లలు నుంచి పెద్దల వరకు నిద్రపోయే విధానంలో చాలా మార్పులు ఉంటాయి. చిన్నప్పుడు నిద్రపోతుంటే ఎంతసేపు నిద్రపోతావు లే అంటూ కేకలేస్తుంటారు తల్లిదండ్రులు. వయసు మీద పడేకొద్ది నిద్రకు దూరమవుతుంటారు. పెద్దలైతే పడుకొనే ఉంటారు కానీ నిద్రపోరు. ఏదోకటి ఆలోచిస్తుంటారు. దీనికి కారణం వారిని వెంటాడే పీడకలలే. దీని గురించి పరిశోధకులు ఏమంటున్నారో చూద్దాం. రోజంతా కష్టపడి రాత్రి కొంచెం విశ్రాంతి తీసుకుంటానికి పడుకుంటే ఏవేవో సంబంధం లేని పీడకలు వెంటాడుతుంటాయి. కళ్లు తెరిచేసరికి కొన్ని గుర్తుంటాయి. కొన్నిసార్లు అసలు ఏం కలులు రానట్లు ఉంటుంది. కలలో వచ్చినవి కొన్ని నిత్య జీవితంలో జరుగుతుంటాయి. ఇవి ఎప్పుడో జరిగినట్లుగా గుర్తొస్తుంది. అవి ఎప్పుడో కాదు కలలో వచ్చినవే. పీడకలలు రావడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

కల‌లో దగ్గర వాళ్లు చనిపోయినట్లు వస్తుంటాయి. ఇది నిజమవుతుందేమో అని భయపడుతుంటారు. ఆ భయంతో ప్రశాంతతకు దూరం అవుతారు. ఆందోళన, తీవ్ర ఒత్తిడి, కుంగుబాటుకు గురికావచ్చని పరిశోధకులు తెలుపుతున్నారు. నిద్రలో వచ్చే పీడకలలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. వీటివల్ల నిద్రపోవాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. ఇది క్రమేణా నిద్రలేమికి దారితీస్తుంది. ఇటీవల అధ్యయనంలో తేలింది ఏమిటంటే.. పీడకలలు లేదా చెడుకలల‌ వల్ల బాధ, కోపం, గందరగోళం, నిరాశ, అపరాధ భావన, అసహ్యం వంటివి ఏర్పడుతాయ‌ట‌. ఓ సంస్థ 351 మంది పెద్దలపై నిర్వహించిన పరిశోధనలో చాలామంది పీడకలలతో బాధపడుతున్నారని, వారిని ఏదో చెడుశక్తి తరుముతున్న భావానికి గురవుతున్నారని తేలింది. ఈ పీడకలలు నిత్యం వెంటాడుతుంటే అవి అనారోగ్యానికి సంతేకాలని భావించాలని పరిశోధకులు తెలుపుతున్నారు. పెద్దల్లో సుమారు 2 నుంచి 8 శాతం మంది ఈ సమస్య వల్ల నిద్రలేమి రాత్రులు గడుపుతున్నారని పేర్కొన్నారు.

if you are having nightmares regularly then beware

ఈ పరిస్థితిని ఆర్‌ఈఎం స్లీవ్ బిహేవియర్ డిజార్డర్ అంటారు. ఈ సమస్య ఉన్నవారికి ఎక్కువగా పీడకలలు వస్తాయి. నిద్రపోగానే తమ చుట్టూ ఏవో తిరుగుతున్నట్లు, భయపెడుతున్నట్లు, భావిస్తారు. కొందరయితే మంచంపై నుంచి ఎగిరి దూకుతారని వివరించారు. రాత్రి వేళల్లో వచ్చే చెడుకలలు వల్ల ఏమవుతుందో తెలియజేయలేదు కానీ, వాటివల్ల కలిగే నిద్రలేమి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. ఇది క్రమేణా ఒత్తిడికి దారితీసి మనిషిని కుంగదీస్తాయి అని జాసన్ ఎల్లీస్ అనే పరిశోధకుడు తెలిపారు. మీకూ పీడకలలు వస్తుంటే వాటి నుంచి బయటపడండి. జాగ్రత్త వహించండి. వీలైతే మానసిక నిపుణులు సంప్రదించండి.

ఇక మ‌న పెద్ద‌లు అయితే నిద్రంచే ముందు మంచం కింద చెప్పులు, చీపురు కట్ట పెట్టుకుంటే పీడకలలు రాకుండా ఉంటాయ‌ని చెబుతుంటారు. అలాగే రోజంతా బయట తిరిగి ఇంట్లోకి ప్రవేశించగానే కాళ్లు, చేతులు కడుక్కొని లోపలికి రావాలి. దీంతో చెడు ప్రభావం ఇంట్లోకి ప్రవేశించదు. టెక్నాలజీ పెరగుతున్న ఈ రోజుల్లో ఈ మూడనమ్మకాలేంటని కొట్టిపారేయకండి. ఇవి చేయడం వల్ల మీ సమయం ఏమీ వృథా అవ్వదు.

Tags: Nightmares
Previous Post

రోజూ రాత్రి యాల‌కుల‌ను తింటే శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొంటార‌ట‌..!

Next Post

ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా క‌నిపించాల‌ని అనుకుంటున్నారా..? అయితే త‌ర‌చూ రెడ్ వైన్ తాగండి..!

Related Posts

ఆధ్యాత్మికం

గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

June 8, 2025
వినోదం

మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

June 8, 2025
వినోదం

ఖుషి సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?

June 8, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి గుండె పోటు ఎందుకు వ‌స్తుంది..?

June 8, 2025
హెల్త్ టిప్స్

కేవలం పండ్లు లేదా వెజిట‌బుల్ జ్యూస్‌ల‌ను తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

June 8, 2025
చిట్కాలు

త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఈ 4 ఆహారాలను తీసుకోవ‌చ్చు.. కానీ..?

June 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!